పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘రాథేశ్యామ్’ సినిమా చేస్తున్నారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్నఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుది. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ తో మూవీ, ‘ఆదిపురుష్’ మూవీలను ప్రకటించినప్పటికీ.. ఈ రెండు సినిమాల తర్వాత ఎనౌన్స్ చేసిన ‘సలార్’ మూవీ షూటింగ్ ని ముందుగా స్టార్ట్ చేయనున్నాడు. జనవరి నుంచి ‘సలార్’ షూటింగ్ లో ప్రభాస్ జాయిన్ అవుతాడు. సమ్మర్ కి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలనేది ప్లాన్. దీనికి పక్కా ప్లాన్ రెడీ అయ్యింది.
అయితే.. ఈ సినిమాలో ప్రబాస్ సరసన ఇద్దరు హీరోయిన్లు ఉంటారని వార్తలు వస్తున్నాయి కానీ.. అఫిషియల్ గా ఎలాంటి ఎనౌన్స్ మెంట్ రాలేదు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ‘ఫిదా’ బ్యూటీ సాయిపల్లవి నటించనున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఈ వార్త బయటకి వచ్చినప్పటి ప్రభాస్ కి సాయిపల్లవికి సెట్ అవుతుందా..? అనే సందేహం మొదలైంది.
గతంలో ఓ ఇంటర్ వ్యూలో ప్రభాస్ సాయిపల్లవి గురించి స్పందిస్తూ… సాయిపల్లవి మలయాళంలో రూపొందిన ‘ప్రేమమ్’ సినిమాలో చాలా బాగా నటించింది. ఆమె వెరీ గుడ్ యాక్ట్రెస్. ఆమెతో నటించాలని ఉంది కానీ.. హైట్ ప్రాబ్లమ్ వలన ఇద్దరికి సెట్ కాదేమో అనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ‘సలార్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సాయిపల్లవి కి సలార్ లో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్త నిజమేనా.? కాదా..? అనేది తెలియాల్సివుంది.
Mus Read ;- మహేష్ మచ్చల గురించి సాయిపల్లవికి ఎలా తెలుసు?