ఏపీలో విగ్రహాలు విధ్వంసం ఆగడం లేదు. రామతీర్థం ఘటనపై ప్రతి పక్షాలు, హిందూ పరిరక్ష సమితులు, స్వామీజీలు కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో.. తాజాగా మరొక ఘటన చోటుచేసుకుంది. విశాఖపట్నం గోలుకొండ మండలం ఏటిగైరం పేటలో వినాయక విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. రామాలయంలోని వినాయక ఉపాలయం లోని విఘ్నేశ్వరుడి విగ్రహం చేతులను దుండగులు ధ్వంసం చేశారు.
బెదరని దుండగులు.. ఆగని దాడులు..
ప్రభుత్వం విగ్రహ దాడులు చేస్తున్న వారిని వదలబోం అని స్టేట్ మెంట్లు ఇస్తున్నా కూడా దుండగులు జంకు లేకుండా విగ్రహ దాడులకు పాల్పడుతున్నారు. ప్రతి రోజు ఎక్కడో ఒకచోట ఏపీలో విగ్రహ ధ్వంసం జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం సిఐడి విచారణ వేసినా కూడా ఏమాత్రం భయపడకుండా దుండగులు ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడం విచిత్రంగా ఉందనిపిస్తుంది. ఏ ధైర్యంతో దుండగులు ఇలాంటి చర్యలు చేస్తున్నారో అర్ధం కాని విషయం. పట్టుకుంటే మాత్రం ఏం చేస్తారులే అనే ధైర్యమా.. లేక అసలు పట్టుకోరులే అనే నిర్లక్ష్యమా? ఏమో దుండగుల సంగతి.. ప్రభుత్వం తీరు.. పెరుమాళ్లకే ఎరుక.
Must Read ;- ఎవ్వరినైనా సరే.. రామతీర్థం వెళ్లనివ్వరంతే!











