రీమేక్స్ లో నటించడం అంటే వెంకీకి ఎంతో ఆసక్తి . ఆయన కెరీర్ లోని ల్యాండ్ మార్క్ మూవీస్ అన్నీ దాదాపు గా రీమేక్ వెర్షన్స్ కావడం విశేషం. ప్రస్తుతం వెంకటేశ్ ‘నారప్ప, దృశ్యం 2’ రీమేక్స్ లో నటించారు. ఈ రెండు సినిమాలూ ఒరిజినల్స్ ను మ్యాచ్ చేసేలా మేకర్స్ కేర్ తీసుకుంటున్నారు. ఇక ఇవే కాకుండా.. ఇప్పుడు వెంకీ మరో మలయాళ మూవీపై మనసు పారేసుకున్నాడట. సినిమా పేరు డ్రైవింగ్ లైసెన్స్.
బిఫోర్ లాస్టియర్ మలయాళ బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమా ‘డ్రైవింగ్ లైసెన్స్’ . పృధ్విరాజ్ సుకుమారన్, సురాజ్ వెంజారమూడ్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాను జూనియర్ లాల్ (నటుడు లాల్ తనయుడు) తెరకెక్కించాడు. ఒక సూపర్ స్టార్ కి, అతడి వీరాభిమాని అయిన ఆర్టీవో ఆఫీసర్ కి మధ్య ఇగో క్లాషెస్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. నిజానికి ఈ సినిమా రీమేక్ రైట్స్ ను రామ్ చరణ్ ఎప్పుడో తీసుకున్నాడని, పవర్ స్టార్ తో ఈ సినిమా తీయబోతున్నాడని ఆ మధ్య వార్తలు వినిపించాయి. అలాగే.. రవితేజ, విజయ్ సేతుపతి తో కూడా సినిమా ఉంటుందనే రూమర్స్ వ్యాపించాయి.
తాజాగా ఈ సినిమా మీద వెంకటేశ్ మనసుపడ్డాడని తెలుస్తోంది. ఒకవేళ రామ్ చరణ్ నిజంగానే ఈ సినిమా రైట్స్ తీసుకుని ఉంటే.. వెంకీతో సినిమాను తీయడం అతడికి సమస్య కాదు. అలాగే.. సురేశ్ ప్రొడక్షన్స్ తో సంయుక్తంగా సినిమాను నిర్మించాలన్నా చెర్రీ వెనుకాడడు. అయితే ఇందులో వెంకటేశ్ నటిస్తుంటే.. రెండో పాత్ర ఎవరు చేస్తారనే విషయంలో ఆసక్తి నెలకొంది. మరి నిజంగానే ‘డ్రైవింగ్ లైసెన్స్’ మూవీ వెంకీతోనే తెరకెక్కుతుందో లేదో చూడాలి.











