కరోనా కారణంగా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. ఈ నెల నుంచి థియేటర్లు ఓపెన్ చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు థియేటర్స్ ను రీ ఓపెన్ చేసుకోవడానికి వీలుగా అనుమతులు ఇవ్వడం.. అలాగే థియేటర్ల యాజమాన్యానికి లోన్లు కూడా ఇవ్వనున్నట్టు ప్రకటించడం తెలిసిందే. అయితే.. థియేటర్లు ఓపెన్ చేసినా జనాలు సినిమా చూడడానికి వస్తారో రారో అనేది డౌట్. ఈ నెల 25న సాయిధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటరు సినిమా రిలీజ్ కానుంది. ఇక సంక్రాంతికి మాస్ మహారాజా రవితేజ క్రాక్ మూవీని రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. జనాలు థియేటర్ కి రావాలంటే.. క్రేజీ మూవీ రిలీజ్ కావాలి. స్టార్ హీరోల సినిమాలు, కుటుంబ కథా చిత్రాలు వస్తే.. ఖచ్చితంగా జనాలు థియేటర్ కి వస్తారు. అందుకనే దిల్ రాజు అర్జెంటుగా ఎఫ్ 3 మూవీని స్టార్ట్ చేశారు. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి మాస్ పల్స్ బాగా తెలుసు. ఎఫ్ 2 సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈసారి బడ్జెట్ ఎక్కువైనా సరే.. ఎఫ్ 3 మూవీని ప్రారంభించేశారు. అంతే కాకుండా సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలనేది దిల్ రాజు ప్లాన్.
ఈ నెల నుంచే రెగ్యురల్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. సమ్మర్ కి ఎఫ్ 3 సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అప్పటికి జనాలు థియేటర్ కి రావడం అలవాటు పడతారు. ఈ సినిమాకి జనాలు భారీగా తరలి వస్తారనేది దిల్ రాజు అంచనా. ఈ సినిమాలో ఎఫ్ 2 కు మించిన ఎంటర్ టైన్మెంట్ ఉంటుందట. అలాగే గ్లామర్ డోస్ కూడా కాస్త ఎక్కువే ఉంటుందని తెలిసింది. దిల్ రాజు ప్లాన్ బాగానే ఉంది. వర్కవుట్ అయితే.. భారీగా లాభాలు రావడం ఖాయం.











