ఒకప్పటి జానపద కథానాయకుడు, దివంగత నటుడు టీ.యల్. వి కాంతారావు భార్య హైమావతి కన్నుమూశారు. నేటి మథ్యాహ్నం మల్లా పూర్ లోని ఆమె నివాసంలో ఆమె గుండెపోటుకు గురవడంతో తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 87 సంవత్సరాలు. కాంతారావు , హైమావతి దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె.
ఈ రోజు హైమావతి అంత్యక్రియలు జరిగే అవకాశముంది. ఆమె మృతికి పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు తమ సంతాపం ప్రకటించారు. కాంతారావుకి హైమావతి రెండో భార్య. మొదటి భార్య సుశీల అనారోగ్యం కారణంగా ఆయన రెండో వివాహం చేసుకున్నారు. ఆయన పెళ్ళి జరిగిన కొద్ది రోజులకే ఆమె మరణించింది.
Must Read ;- 2021 టాలీవుడ్ డైరీలో కొన్ని పేజీలు











