విశాఖ స్టీల్ ప్లాంట్‌పై బీజేపీ ఎంపీ సుజనాచౌదరి స్పందించారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడాన్ని ఆయన సమర్థించారు. దీనికి సంబంధించి హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడులు పెంచేందుకే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తున్నారని తెలిపారు. స్టీల్ ప్లాంట్‌పై ప్రభుత్వం వ్యాపారం చేయకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ప్రైవీటీకరణపై విపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నారని తెలిపారు. దీనిపై టీడీపీ,వైసీపీ ఆందోళన చేసినంత మాత్రాన ఆగదని తెలియజేశారు. ప్లాంట్ విశాఖలోనే ఉంటుందని.. వెరే దేశానికి వెళ్లడం లేదని వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం త్యాగం చేసిన వారు ఎప్పటికీ గుర్తుంటారనీ.. కానీ పరిస్థితులను బట్టి మనం కాలానుగుణ నిర్ణయాలు తప్పవని స్పష్టం చేశారు.
Must Read ;- విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు.. కాపాడుకుందాం రండి