టీపీసీపీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఖరారు అయినట్లు తెలుస్తోంది.అధిష్టానం ఇప్పటికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.నాలుగైదురోజులుగా ఢిల్లీలో ఉన్న తెలంగాణ ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ సోనియా,రాహుల్ గాంధీలతో చర్చించిన మీదట ఆయన పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సమాచారం పార్టీ అంతర్గతంగా వెల్లడవడంతో ఆయన్ను వ్యతిరేకిస్తున్న కొందరు సీనియర్లు అడ్డుకునేందుకు చిదంబరం ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.దీనికి రేవంత్‌పై ఉన్న ఓటుకు నోటు కేసును తెర మీదకు తెస్తున్నట్లు సమాచారం.
Must Read ;- ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట











