ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.ఈ కేసులో విచారణ పూర్తయ్యే వరకు సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపి వేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.తెలంగాణ ఏసీబీ ఈ కేసులో విచారణ సాగిస్తోంది.విచారణ పూర్తి అయ్యే వరకు సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపివేయాలని ఏసీబీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.దీనిపై 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.తదుపరి విచారణ పూర్తయ్యే వరకు క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపివేయాలని జస్టిస్ గవాయ్,సూర్యకాంత ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
ఈడీ ఛార్జీషీట్‌తో పెరిగిన హీట్..
ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డిపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.దీనిపై నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఈడీ అధికారులు గురువారం ఛార్జీషీట్ దాఖలు చేశారు.ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య,బిషప్ సెబాస్టియన్ హ్యారీ,రుద్ర శివకుమార్ ఉదయ్ సింహా,మత్తయ్య,కృష్ణ కీర్తన్‌పై అభియోగాలు మోపారు.ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.2015లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేయడం కోసం,లేదా ఓటింగ్‌కు హాజరు కాకుండా ఉండేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్వీ స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌రెడ్డి రూ.50 లక్షలు ఇవ్వజూపారని ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
Must Read ;- ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి షాక్ : బాబుకు ఊరట











