దుబ్బాక ఎన్నికల కౌంటింగ్ ఉదయం నుంచే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడిప్పుడే గులాబీ కారు తన స్పీడ్‌ను క్రమంగా పెంచింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవగా ఇప్పటి వరకు మొత్తం 8 రౌండ్లకు కౌంటింగ్ పూర్తైంది. మొదటి 5 రౌండ్లలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు తన ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చారు. కానీ 6, 7, రౌండ్లల్లో మాత్రం టీఆర్ఎస్ పార్టీ లీడింగ్‌లో ఉంది. రౌండ్ రౌండ్‌కు ఉత్కంఠ పెరుగుతోంది. 8వ రౌండ్‌లో బీజేపీ 621 ఓట్లతో లీడింగ్ లో వచ్చింది. మొదట ఈ రౌండ్ లో టీఆర్ఎస్‌కు 200 ఓట్ల ఆధిక్యం వచ్చినట్లుగా కనబడింది కానీ పూర్తి ఫలితాలు వెలువడ్డాక బీజేపీ తన ఆధిక్యాన్ని కనబరిచింది. 7వ రౌండ్‌లో బీజేపీకి 2536 ఓట్లు పోలవగా, టీఆర్ఎస్‌కు మాత్రం 2718 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటి వరకు 52వేల 55 ఓట్లకు సంబంధించిన కౌంటింగ్ పూర్తైంది.
మొత్తం పోలైన ఓట్లు లక్షా 64 వేల 192 ఓట్లు పోలయ్యాయి. లక్షా 12వేల 137 ఓట్లు ఇంకా లెక్కించాల్సి ఉంది. ఆరు, ఏడు రౌండ్లలో టీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యాన్ని కనబరిచింది. ఏడవ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 182 ఓట్ల ఆధిక్యం లభించింది. 6వ రౌండ్‌లో బీజేపీకి 3709 ఓట్లు, టీఆర్ఎస్‌కు 4062 ఓట్లు, కాంగ్రెస్‌కు మాత్రం 530 ఓట్లు పోలయ్యాయి. 8వ రౌండ్ ముగిసే సరికీ బీజేపీ ఇంకా టీఆర్ఎస్ కంటే కూడా 2285 ఓట్ల లీడ్‌లో ఉంది. 8వ రౌండ్ లో బీజేపీకి 621 ఓట్ల ఆధిక్యాన్ని కనబరిచింది.
మొదటి 5 రౌండ్లల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావే తన ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చారు. ఇక 6వ, 7వ రౌండ్లల్లో మాత్రం టీఆర్ఎస్ పార్టీ తన ఆధిక్యాన్ని కనబరిచి కమలాన్ని వెనక్కు నెట్టేసీ కారు తన స్పీడ్‌ను పెంచింది. అయితే 8వ రౌండ్ లో మళ్లీ బీజేపియే తన లీడ్ ను కొనసాగించింది. ఇంకా 15 రౌండ్ల ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది. ఇంకో గట గడిస్తే గానీ ఫలితాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.