పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. ఈ చిత్రానికి ఏంసీఏ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు – బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ సంయుక్తంగా ఈ క్రేజీ మూవీని నిర్మించడం విశేషం. ఇందులో పవన్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఏప్రిల్ 9న ఈ చిత్రాన్నిభారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
బాలీవుడ్ లో సక్సస్ సాధించిన పింక్ మూవీకి ఇది రీమేక్. అయితే.. మాతృకతో పోలిస్తే ఈ రీమేక్‌కు చాలా మార్పులు చేశారట. పింక్ మూవీలో కథానాయిక లేదు. వకీల్ సాబ్ కోసం కథలో కథానాయికను తీసుకొచ్చారు. ఫ్లాష్‌బ్యాక్ జోడించారు. అంతే కాకుండా పాటలతో పాటు ఫైట్లు కూడా పెట్టారు. ఇంకా చెప్పాలంటే.. అభిమానులకు పండగే అనేలా ఈ సినిమాలో కథలో మార్పులు చేర్పులు చేశారు.
ఇప్పుడు మరో స్పెషల్ ఎట్రాక్షన్ జోడిస్తే బాగుంటుందని దర్శకుడు, నిర్మాత అనుకుంటున్నారట. అది ఏంటంటే.. ఓ స్పెషల్ సాంగ్ పెడితే ఇంకా బాగుంటుందని ఆలోచిస్తున్నారని తెలిసింది. ఈ స్పెషల్ సాంగ్ లో ఒకరు కాకుండా ఇద్దరు హీరోయిన్లతో ఆ పాట చేయించాలనుకుంటున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అయితే.. ఆ పాటను ఐటెం సాంగ్లా కాకుండా ఓ స్పెషల్ సాంగ్ లా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అయితే.. ఈ స్పెషల్ సాంగ్ లో నటించే ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరు అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.