ఏపీ పాడి పరిశ్రమను అమూల్ సంస్థకు కట్ట బెట్టే అధికారం వైసీపీ సర్కారుకు ఎక్కడిదని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. టీడీపీ సీనియర్ నేత, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ రాష్ట్రాల్లో అమూల్‌ను వ్యతిరేకించారని ఆయన తెలిపారు. సజ్జల మిల్లర్లతో కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని ఉమ ఆరోపించారు. కాగా, అమూల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడ ఖర్చు చేయవద్దంటూ నిన్న హైకోర్టు సర్కారును ఆదేశించిన విషయం తెలిసిందే.
Must Read ;- అమూల్‌పై ప్రభుత్వ నిధులు ఖర్చు చేయవద్దని హైకోర్టు ఆదేశం











