మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూర్తి చేశాకా.. చిరు వెంటనే ‘లూసిఫర్’ మలయాళ రీమేక్ పై దృష్టిపెట్టనున్నారు. మొన్నా మధ్య అఫీషియల్ అనౌన్స్ మెంట్ జరుపుకున్న ఈ సినిమాను తమిళ దర్శకుడు మోహన్ రాజా హ్యాండిల్ చేయబోతున్నాడు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా అతడు చేసిన మార్పులు చిరును ఎంతగానో ఇంప్రెస్ చేశాయని టాక్.
ఫ్రెంచ్ సూపర్ హిట్ మూవీ ‘లార్గోవించ్’ స్టోరీ లైన్ తో రూపొందుతోన్న లూసిఫర్ రీమేక్ వెర్షన్ లో ఆయన చెల్లెలు పాత్రకు వెటరన్ హీరోయిన్ సుహాసిని ని ఎంపిక చేశారనే వార్తలొస్తున్నాయి. అలాగే.. ఇందులో కథానాయికగా త్రిష నటిస్తోందనే వార్తలూ వచ్చాయి. అలాగే.. ఇందులో చిరుకి అనుచరుడి పాత్ర చాలా కీలకమైనది. ఒరిజినల్ వెర్షన్ లో దాని దర్శకుడు పృధ్వీరాజ్ సుకుమారనే ఆ పాత్రను పోషించి రక్తికట్టించాడు. ఇప్పుడు తెలుగులో ఆ పాత్రకి విలక్షణ నటుడు సత్యదేవ్ ను ఎంపిక చేశారని వినికిడి.
ఇక లూసిఫర్ రీమేక్ లో మరో ముఖ్యమైన పాత్ర ఉంది. చనిపోయిన లీడింగ్ ముఖ్యమంత్రి వారసుడు. మలయాళ వెర్షన్ లో ఆ పాత్రను యంగ్ హీరో టావినో థామస్ పోషించగా.. తెలుగులో ఆ పాత్ర కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ పేరును పరిశీలిస్తున్నారట. చిరంజీవి హీరో కాబట్టి.. వరుణ్ కు ఇందులో నటించడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. అలాగే. సినిమాకి అతడి వల్ల మరింత హైప్ వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం వరుణ్ ‘ఎఫ్ 3, గని’ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ మూవీప్ ను త్వరలోనే కంప్లీట్ చేసి.. లూసిఫర్ రీమేక్ కోసం రంగంలోకి దిగుతాడట. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో చూడాలి.
Must Read ;- నా విజయంలో సగ పాలు బాలు అన్నయ్యదే: చిరంజీవి