డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో ఇండియన్ సిరీస్ ప్రారంభమైనప్పటి నుంచి.. సినిమాలతో సమానంగా వాటికి బ్రహ్మాండమైన ఆదరణ దక్కుతోంది. గ్లామర్ అండ్ పెర్ఫార్మెన్స్ పరంగా వెబ్ సిరీస్ ను ప్రేక్షక వీక్షకులు నెత్తి మీద పెట్టుకుంటున్నారు. భాషతో సంబంధం లేకుండా అవన్నీ సూపర్ హిట్టై. ట్రెండింగ్ లో నిలిచాయి. అలాంటి వాటిలో అత్యధికులు ఇష్టపడే సిరీస్ గా ‘ఫ్యామిలీ మేన్’ నిలిచిపోయింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ వెబ్ సిరీస్ మొదటి సీజన్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
సీజన్ వన్ సూపర్ హిట్టైపోవడంతో.. రెండో సీజన్ కోసం ఇప్పటి వరకూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు ప్రేక్షకులు. నిన్నటితో వారి నిరీక్షణకు తెరపడింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ‘ఫ్యామిలీ మేన్ 2’ స్ట్రీమింగ్ అవుతోంది. గత సీజన్ లో నటించిన కొందరు నటీనటులు సీజన్ 2 లోనూ కనిపిస్తున్నప్పటికీ.. ఈ సీజన్ కు హైలైట్ గా నిలిచిపోయింది మాత్రం అందాల సమంతనే. దీంతో మొట్టమొదటి సారిగా ఆమె డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టడం విశేషం. డీ గ్లామరైజ్డ్ పాత్రలో నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రను పోషించిన సమంత ఈ సీజన్ ను తన భుజ స్కంధాలపై మోసింది.
రాజీ అనే సమంత పాత్ర గురించి ఇప్పుడు అంతటా డిస్కషన్ నడుస్తోంది. ఇంతకు ముందెన్నడూ ఇటువంటి ఛాలెంజింగ్ రోల్ ను సమంత పోషించకపోవడంతో .. జనానికి చాలా కొత్తగా అనిపిస్తోంది. గతంలో ఇలాంటి పాత్రనే ‘పత్తు ఎన్రదుక్కుళ్ళా’ అనే విక్రమ్ నటించిన ఓ తమిళ సినిమాలో పోషించినప్పటికీ.. సినిమా ప్లాప్ అవడంతో ఆమె పాత్రను అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఫ్యామిలీ మేన్ సీజన్ 2 కే సమంతా పాత్ర బలంగా నిలిచింది. కొన్ని చోట్ల బోల్డ్ గా నటించి ఆశ్చర్యపరిచింది. అలాగే ఎమోషనల్ సీన్స్ లోనూ, యాక్షన్ ఘట్టాల్లోనూ అదరగొట్టింది. మొత్తానికి ఈ సిరీస్ కు సమంతా యాక్షన్, పెర్ఫార్మెన్స్ ఒక ప్యాకేజ్ అని చెప్పాలి. లీడ్ రోల్ చేసిన లెజెండరీ యాక్టర్ మనోజ్ బాజ్ పాయ్ పాత్రకు థీటుగా నిలిచి.. సత్తా చాటుకుంది సమంతా.
Must Read ;-సమంత పాత్ర కొంపముంచేలా ఉంది!