వకీల్ సాబ్ సినిమా టికెట్ రేట్లు పెంచుకునే విషయంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సవరించింది. సింగిల్ బెంచ్ తీర్పును కేవలం ఇవాళ వరకే అమలు చేయాలని ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు నిచ్చింది. రేపటి నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు టికెట్ ధరలు ఉండాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది. ఆన్ లైన్లో బుక్ చేసుకున్న టికెట్ల విషయంలో రేపటి షోల వరకు వెసులుబాటు కల్పిస్తూ డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. మొదటి రోజు మాత్రమే టికెట్ రేట్లు పెంచుకోవచ్చని, ఆ తరవాత మామూలు ధరలు అమలు చేయాలని ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది.
Must Read ;- వకీల్ సాబ్ వర్సెస్ జగన్ సాబ్?