టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో వంగవీటి రాధా భేటీ అయ్యారు. ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్సీల జాబితాలో వంగవీటి రాధా పేరు రాలేదు. దీంతో వంగవీటి వర్గం తీవ్ర అసంతృప్తిలో ఉంది. ఈ నేపథ్యంలో రాధా చంద్రబాబుతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2019లో జగన్‌తో విభేధించి వైసీపీని వీడిన రాధా..తర్వాత తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు.
చంద్రబాబుతో బుధవారం అమరావతిలో భేటీ అయ్యారు రాధా. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆయనకు త్వరలోనే పదవి ఖాయమనే ప్రచారం కూడా జరుగుతోంది. వంగవీటి రాధా ఎన్నికల తర్వాత కూడా యాక్టివ్‌గా ఉన్నారు. కూటమి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఐతే అనుచరులు రాధాకు పదవి ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. సీఎంవో నుంచి పిలుపు రావడంతోనే వంగవీటి రాధా చంద్రబాబును కలిసినట్లు తెలుస్తోంద.
2019లో తెలుగుదేశం పార్టీలో చేరిన రాధాకు అప్పటి నుంచి ఏ పదవి దక్కలేదు. గతేడాది టైంలో ఆయన జనసేన లేదా వైసీపీలో చేరతారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆయన టీడీపీలోనే కొనసాగారు. జానికి అసెంబ్లీ టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా పొత్తులో భాగంగా రాధాకు ఇవ్వడం కుదరలేదు. ఐనప్పటికీ కూటమి విజయం కోసం తనవంతు కృషి చేశారు రాధా. ఇక ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో ఒకటి రాధాకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆ పదవి ఆయనకు కేటాయించ లేదు.