కరోనా ప్రభావం తక్కువగా ఏమీ లేదు. ఈ కరోనా ప్రభావంతో ఓ సీనియర్ జర్నలిస్టు, హీరో వరుణ్ సందేశ్ కు తాత అయిన జీడిగుంట రామచంద్రమూర్తి కన్నుమూశారు. ఆయన ప్రముఖ రచయిత కూడా. అనేక కథలు రాశారు. ఆయన కుటుంబం అంతా కళా రంగానికే అంకితమైంది. గత కొంతకాలంగా ఆయన కరోనా సోకి ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే కన్నుమూశారు.
టీవీ, సినిమా రంగంతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. టీవీ రచనలకు గాను రెండు సార్లు నంది అవార్డు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సాహితీ రంగంలో కళారత్న అవార్డును కూడా అందుకున్నారు. కొన్ని సినిమాలకు మాటల రచయితగానూ పనిచేశారు. అమెరికా అబ్బాయి, ఈ ప్రశ్నకు బదులేది? సినిమాలకు మాటలు రాశారు. ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.











