వీబీ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ సినిమా తారల డైరీని ఆవిష్కరించింది. 2014 నుంచి ఈ సంస్థ తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీని ప్రచురిస్తోంది. బుల్లితెర, వెండితెర అవార్డులను కూడా ఈ సంస్థ అందిస్తోంది. విబి ఎంటర్ టైన్మెంట్ అధినేత విష్ణు బొప్పన ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా సినిమా తారల డైరీని , లేడీ డైనమిక్ డైరెక్టర్, గిన్నిస్ బుక్ అవార్డు గ్రహీత విజయనిర్మలకు అంకితమిచ్చారు. డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం ఫిలిం ఛాంబర్ , ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్ లో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా మా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేష్, సినీ హాస్య నటులు బాబూ మోహన్, దర్శకుడు వి. ఎన్. ఆదిత్య, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్, ఎస్.ఆర్. ఆర్ ఇన్ఫాస్టెక్చర్స్ అధినేత శ్రీనివాసరెడ్డి, వి వి కె హౌసింగ్ అధినేత విజయ్ కుమార్ , వి. బి .ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత విష్ణు బొప్పన, బి జె పి అధికార ప్రతినిధి అనుగుల రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వి.బి ఎంటర్టైన్మెంట్స్ ఫిలిం అండ్ టి వి డైరీని నటుడు బాబూ మోహన్ ఆవిష్కరించి తొలికాపీని నటుడు నరేష్ కు, రెండో కాపీని దర్శకుడు వి. ఎన్ .ఆదిత్య కు అందజేశారు. అనంతరం త్వరలో జరగబోయే వెండితెర అవార్డ్స్ ఫంక్షన్ పోస్టర్ ను నరేష్ విడుదల చేశారు. అతిథులంతా కలసి నటుడు పొట్టి వీరయ్యకు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు తో పాటు ఎస్. ఆర్. ఆర్ ఇన్ఫాస్టెక్చర్ అధినేత శ్రీనివాసరెడ్డి ఆర్థిక సహాయం అందజేసారు. వీరితో పాటుగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో ఫెంక్షన్ రాని పదిమంది పేద కళాకారులకు ఆర్థిక సాయం అందించారు.ఈ కార్యక్రమం చూసి స్పందించిన వి.వి.కె హౌసింగ్స్ అధినేత విజయకుమార్ మా ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు ఒక లక్ష రూపాయల విరాళం ప్రకటించి చెక్కును ప్రెసిడెంట్ నరేష్ కు అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి బాబూ మోహన్ మాట్లాడుతూ….ఈ సంవత్సరం డైరీని లేడీ డైనమిక్ డైరెక్టర్, గిన్నీస్ బుక్ అవార్డు గ్రహీత కీ. శే. విజయ నిర్మల కు అంకితం ఇవ్వడం, పొట్టి వీరయ్య లాంటి కళాకారుడిని సన్మానించుకోవడం, ఈ కరోన క్రైసెస్ టైం లో పేద కళారులకు సాయం చేసిన విష్ణు బొప్పన ను అభినందిస్తున్నాని అన్నారు.
నరేష్ మాట్లాడుతూ. ఓ సంస్థ ను నడుపుతూ అందులో పేద కళాకారులను విష్ణు ఆడుకోవడం ఆనందదాకమన్నారు. ఈ కరోన సమయంలో కూడా కష్టపడి డైరీని రూపొందించి , మా అమ్మగారికి అంకితం ఇవ్వడం, సూపర్ స్టార్ కృష్ణ గారి ఆశీస్సులు పొందడం విష్ణు పట్టుదలకు నిదర్శనమని కొనియాడారు. వి ఎన్ ఆదిత్య మాట్లాడుతూ ఈ కరోనా సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తునందుకు రావాలా వద్దా అని సంశయిస్తు వచ్చాను. ఇక్కడికి వచ్చాక అందర్నీ చూసి ఆనందం కలిగింది. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తునందుకు విష్ణును అభినందిస్తున్నాను అన్నారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమాలకు ఎస్ .ఆర్. ఆర్ ఇఫాస్టెక్చర్స్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. విష్ణు బొప్పన మాట్లాడుతూ ఈ ఏడాది 2020 డైరీని మార్చి నెల 27 తేదీన ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించడానికి అన్నీ ఏర్పాట్లు చేసుకున్నామని, కానీ కోవిడ్ 19 కారణంగా, లాక్డౌన్ రావడంతో వాయిదా వేసుకుని, ఈరోజు న కరోన నిబంధనలకు అనుగుణంగా, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ నిర్వహించామని వివరించారు..
మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?
ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...










