విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ‘లైగర్’ సినిమా రూపొందింది. ఈ కథను విన్న కరణ్ జొహార్ ఈ సినిమాకి పాన్ ఇండియా స్థాయి ఉందనే విషయాన్ని గ్రహించి, తాను ఒక నిర్మాతగా మారారు. ఈ సినిమాకి కథానాయికగా అనన్య పాండేను సెట్ చేసింది ఆయనే. అంతే కాకుండా ఈ సినిమా నిర్మాణానికిగాను భారీ స్థాయిలో ఖర్చు చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. విజయ్ దేవరకొండ అభిమానులంతా కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలకి ముహూర్తాన్ని ఖరారు చేశారు. సెప్టెంబర్ 9వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ను తన ఫేస్ బుక్ ద్వారా ‘జబర్దస్త్’ గెటప్ శ్రీను కూడా వదిలాడు. ఈ సినిమాలో ఆయన కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. ఈ పోస్టర్లో విజయ్ దేవకొండను చూస్తే, తెరపై ఆయన విజృంభణ ఏ స్థాయిలో ఉంటుందనేది అర్థమవుతోంది.
పూరి జగన్నాథ్ సినిమాలు మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందుతాయి. అందుకే ఆయన సినిమాలకు మాస్ ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఉంటుంది. మాస్ సెంటర్లలో ఆయన సినిమాలు భారీ వసూళ్లను రాబడతాయి. ఈ మధ్య వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్‘ కూడా ఇదే విషయాన్ని నిరూపించింది. ఇక విజయ్ దేవరకొండకి యూత్ తో పాటు మాస్ ఆడియన్స్ లోను విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన బాడీ లాంగ్వేజ్ ను .. డైలాగ్ డెలివరీని వాళ్లు ఎంతగానో లైక్ చేస్తారు. ఈ ఇద్దరి మాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ, మరో సంచలనానికి తెరతీస్తుందేమో చూడాలి.
Must Read ;- పూరి అసలు ప్లాన్ ఇదే .. !











