మాస్ మహారాజా రవితేజ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వీరిద్దరి కాంబినేషన్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, దేవుడు చేసిన మనుషులు, నేనింతే’.. సినిమాలు రూపొందాయి. ఈ సినిమాల్లో ‘ఇడియట్’ సినిమా ఓ సంచలనం. ఈ సినిమా తర్వాత నుంచి సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ స్టైలే పూర్తిగా మారిపోయింది.
‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా తప్పితే.. మిగిలిన సినిమాలన్నీ సక్సెస్ సాధించాయి. దీంతో రవితేజ – పూరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది.. అంటే అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. ఇదిలా ఉంటే.. రవితేజ, పూరి కలిసి మరో సినిమా చేయాలను కుంటున్నారని తెలిసింది. దీనికి సంబంధించి డిష్కసన్స్ జరిగాయని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. రవితేజ ‘క్రాక్’ సినిమాతో ఫామ్ లోకి వచ్చారు. సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ప్రస్తుతం ‘ఖిలాడి’ సినిమా చేస్తున్నారు. రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండతో లైగర్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ ముంబాయిలో ప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాత రవితేజ – పూరి కాంబినేషన్ లో మూవీ అంటూ గట్టిగా వినిపిస్తుంది. ఈ క్రేజీ కాంబినేషన్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఈ సినిమా సెట్ అయితే.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడం ఖాయం.
Must Read ;- మెగాస్టార్ ని డైరెక్ట్ చేయనున్న రవితేజ డైరెక్టర్