డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం ‘లైగర్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ – బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటిస్తున్నారు. కరోనా కారణంగా ఆగింది కానీ.. లేకపోతే ఈపాటికే లైగర్ కంప్లీట్ అయ్యుండేది. లైగర్ ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ముంబాయిలోనే ఈ షెడ్యూల్ ఉంటుందని సమాచారం.
ఇదిలా ఉంటే.. పూరి ‘లైగర్’ తర్వాత చిరంజీవితో సినిమా చేయనున్నారని.. లేదు బాలకృష్ణతో సినిమా చేయనున్నారని వార్తలు వచ్చాయి. ఇటీవల చిరు, బాలయ్యతో కాదు నాగార్జునతో సినిమా ప్లాన్ జరుగుతుందని.. ఇది సోషియో ఫాంటసీ మూవీ అని కూడా వార్తలు వచ్చాయి. ప్రచారంలో ఉన్న వార్తలు ఇలా ఉంటే.. పూరి మైండ్ లో మాత్రం వేరే ఆలోచనలు ఉన్నాయని తెలిసింది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. లాక్ డౌన్ టౌమ్ లో పూరి ఏకంగా 10 స్టోరీలు రాసారట.
ఈ 10 స్టోరీలు టాలీవుడ్, బాలీవుడ్ రేంజ్ స్టోరీలు కావు. హాలీవుడ్ రేంజ్ స్టోరీలు. ఈ స్టోరీలతో పూరి ఇప్పుడు హాలీవుడ్ వైపు చూస్తున్నారట. ఎప్పటి నుంచో హాలీవుడ్ లో మూవీ చేయాలనేది పూరి డ్రీమ్. ఇప్పుడు ఆ డ్రీమ్ వైపే పూరి ఆలోచనలు అన్నీ. హైదరాబాద్ నుంచి ముంబాయికి మకాం మార్చిన పూరి.. హాలీవుడ్ టార్గెట్ గా భారీ చిత్రాలు.. ఇప్పటి వరకు రాని కథలతో సినిమాలు చేసేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు. లైగర్ కంప్లీట్ అవ్వడమే ఆలస్యం.. పూరి హాలీవుడ్ మూవీ చేయడం పక్కా అని సమాచారం.
Must Read ;- పేరులో నేముంది కాదు.. పూరి పంజా పేరులోనే ఉంది











