అందం పెంచిపోషించిన అమ్మాయిలా నభా నటేశ్ కనిపిస్తుంది. ముద్దుగా .. బొద్దుగా చూడముచ్చటగా అనిపిస్తుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో బీచ్ సాంగ్స్ లో ఇసుక తెన్నెలపై ఈ అమ్మాయి అందాలు జారిపోతుంటే, కుర్రాళ్ళు గగ్గోలు పెట్టారు. ఈ పిల్ల అందాలను తడపడానికి సముద్రం ముందుకొచ్చేస్తుందేమోనని అనుకున్నారు. అప్పుడు వేడెక్కిన ఇసుక తెన్నెలు ఇప్పటికీ చల్లారలేదనేది లోకల్ గా వినిపిస్తోన్న టాక్. అప్పటి నుంచి అవకాశాలు ఒక్కొక్కటిగా వచ్చేసి నభా ఒళ్లో వాలుతూనే ఉన్నాయి .. ఆమె గ్లామర్ కి మెచ్చి అభిమాన సంఘాలు చేరుతూనే ఉన్నాయి.

పిప్పరమెంటు లాంటి ఈ పిల్ల ఈ మధ్య సోషల్ మీడియాలోను తన జెండాను రెపరెపలాడించడానికి ట్రై చేస్తోంది. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం మాదిరిగా కుర్రాళ్లను ఊరిస్తోంది. తాజాగా వదిలిన ఫొటోలో డిజైనర్ గౌనులో పట్టులాంటి అందాలను పరుస్తూ .. తేనెబొట్టులాంటి సొగసులతో మెరుస్తూ కనిపిస్తోంది. అందానికి నిండుతనం .. పండుగతనం తెచ్చినట్టుగా మనసులన్నిటినీ మాలగా కట్టేస్తోంది. పూవుల చుట్టూ తేనెటీగలు .. అందం చుట్టూ అల్లరి చూపులు తిరగడం సహజమేననే సంగతిని నిరూపిస్తోంది.
కొంచెం హాటుగా .. మరికొంచెం స్వీటుగా కనిపించే నభా నటేశ్, ‘సోలో బ్రతుకే సో బెటర్’ .. ‘అల్లుడు అదుర్స్’ సినిమాలలో గ్లామర్ పరంగా చెలరేగింది. ఈ సినిమాల సక్సెస్ సంగతి ఎలా ఉన్నా, అందాలు ఆరబోసే విషయంలో నభాకు ఫుల్ మార్కులు ఇచ్చేశారు. దాంతో ఆ తరువాత కూడా ఈ అమ్మాయికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. రెండు మూడు కథలు చర్చల దశలో ఉండగా, ముందుగా ‘అంధాదున్’ రీమేక్ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నయని అంటారు. ఈ ఘాటు అందాలను ప్లేటులో వడ్డించుకోవడానికి అభిమానులు రెడీగానే ఉన్నారు మరి.
Also Read: అల్లుడి పక్కన అమ్మాయేమీ తగ్గలేదండోయ్!











