కాకినాడ పోర్టు అంశంలో సీఐడీ విచారణ నుండి బయటకు వచ్చిన వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి… వైసీపీలో జరుగుతున్న పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైసీపీ నేత, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిపై విరుచుకుపడ్డారు.. మొత్తం ఆయనే చేశారని మండిపడ్డారు.. ఇటు, జగన్ భార్య భారతీ రెడ్డి కూడా అధికార దుర్వినియోగం చేసి జగన్‌ని నడిపించారని, తప్పు దోవ పట్టించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు విజయ సాయి రెడ్డి..
జగన్ కోటరీని తప్పు పట్టారు ఏ2. ఇదే ఆయన ఓటమికి కారణం అయిందని ఆరోపించారు.. జగన్ చుట్టూ కోటరీ ఉంది దానివల్లే తాను జగన్ కు దూరం అయ్యానని తెలిపారు విజయసాయి రెడ్డి.. ఆయన మనసులో నాకు స్థానం లేదు అని తెలిసిందని, ఆ విషయం తెలిసి తన మనసు విరిగిందని చెప్పుకొచ్చారు.. అందుకే పార్టీ నుంచి వెళ్లి పోతున్నాను అని జగన్ కు చెప్పినట్లు వివరించారు..
జగన్ భవిష్యత్తు బాగుండాలంటే కోటరీ నుండి బయటపడాలని ఆయన హెచ్చరించారు.. జగన్ ను ఎవరికైనా పరిచయం చేయాలంటే ఈ కోటరీ కి లాభం చేకూర్చాల్సి ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి.. నాయకుడు చెప్పుడు మాటలు నమ్మకూడదని, చెప్పుడు మాటలు నమ్మితే నాయకుడు, పార్టీ, ప్రజలు నష్టపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. లిక్కర్ స్కాం లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కీలక పాత్రధారి అని బాంబ్ పేల్చారు విజయసాయి రెడ్డి..
తాను వైసీపీలో అనేక అవమానాలు, కష్టాలు పడ్డానని, పదవులు ఇచ్చినా అవమానాలు తట్టుకోలేక వెళ్ళిపోయానని తెలిపారు.. తమ నాయకుడు జగన్‌లోనే మార్పు వచ్చిందని, ఒకప్పుడు ఆయన అంటే భక్తి ఉండేది, ఇప్పుడు అది దేవుడి మీదకు వెళ్ళిందని ఆవేశంగా ప్రకటించారు విజయసాయి రెడ్డి..
మొత్తమ్మీద, వైసీపీ అధినేత జగన్‌తోపాటు ఆ పార్టీలో కీలక వ్యక్తులుగా ముద్ర పడిన సజ్జల, భారతిపై సంచలన ఆరోపణలు చేయడంతో ఆ పార్టీ నేతలు ఉలిక్కిపడ్డారు.. జగన్ సన్నిహితుడిగా, ఆయన తర్వాత పార్టీలో నెంబర్ టూగా వ్యవహరించిన విజయసాయి రెడ్డి, నేడు ఆయనకి శత్రువుగా మారడం ఆ పార్టీ వర్గాలలో దుమారం రేపుతోంది.. ఆయన అప్రూవర్‌గా మారితే పరిస్థితులు ఏ రేంజ్‌లో ఉంటాయో అనే భయం వైసీపీ నేతలను వెంటాడుతోంది.. మరి, విజయసాయి రెడ్డి తనకి తెలిసిన లోగుట్టు బయటపెడతారా..? లేదా.? అనేది చూడాలి..