దుబ్బాక ఎన్నికలు ముగిశాయి. ఇక ఆ ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దుబ్బాక ప్రజలే కాదు రాజకీయ పార్టీలతోపాటు, రాష్ట్ర ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా దుబ్బాక ఫలితాల 10వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ ఎవరు గెలుస్తారో? ఎవరు ఓడిపోతారో? అని అతృతగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటే ఆ పార్టీ తీరు ఎలా ఉండబోతోంది. ప్రతి కూలంగా ఉంటే ప్రతిపక్ష పార్టీల ప్రచారం, ఆరోపణల శైలి గులాబీ పార్టీపై ఎలా ఉంటుందో తెలిపే ప్రకటనలు, కార్టూన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దుబ్బాక ఫలితాలు ఈనెల 10వ తేదీన వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఎక్కువగా ఉంటుందని ముందునుంచి అంతా అనుకున్నారు. ఫలితాలకు సమయం దగ్గరపడుతుండటంతో దుబ్బాక ఎన్నికలో ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే ఆ విజయంపై పార్టీనేతల ప్రచార శైలి ఎలా ఉంటది? ఒకవేళ టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయి బీజేపీ గెలుస్తే.. అధికారపార్టీపై బీజేపీ, ఇతర పార్టీ నేతల విమర్శలు, ఆరోపణలు ఎలా ఉండబోతుందో తెలిపే కార్టూన్లు వాట్సప్‌లో ముందస్తుగానే చక్కర్లు కొడుతున్నాయి. గెలిచిన వారు తమకు అనుకూలంగా, ఓడిన పార్టీకి వ్యతిరేకంగా విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టుకుని సిద్ధంగా ఉన్నట్లు తెలిపే ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వాటిని ఒక సారి పరిశీలిస్తే…
ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే…
-రైతు బంధు, పింఛన్లు గట్టెక్కించినయ్
-ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావు వ్యూహాలు ఫలించాయి.
-అధికార పార్టీ కావడం బాగా కలిసివచ్చిన అంశం.
-టీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత.. ఓటు రూపంలో ఇంకా రాలేకపోయింది.
-త్రిముఖపోరు వల్ల ఓట్లు బాగా చీలి టీఆర్ఎస్‌కు కలిసివచ్చింది.
టీఆర్ఎస్ ఓడిపోతే…
-తెలంగాణలో ఇక బీజేపీ ప్రభంజనం మొదలైంది.
-కేసీఆర్, హరీష్ రావు చరిష్మా సన్నగిల్లింది.
-హరీష్ రావు వ్యూహాలు ఫలించలేదు.
-కేసీఆర్ ప్రజల్లోకి రాకపోవడం, కుటుంబ పాలన, కరోనా వచ్చినా ప్రజలను గాలికి వదిలేయడం ప్రజలకు నచ్చలేదు.
-టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారు.
-బండి సంజయ్, రఘునందన్‌రావు చరిష్మా బాగా కలిసివచ్చింది.
-బలమైన శక్తిగా బీజేపీ ఎదుగుతుందనే దానికి ఇదే నిదర్శనం
-ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపును టీఆర్ఎస్ నేతలు ఆపలేకపోయారు.
ఇలాంటి అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్ ఓడితే, గెలిస్తే.. ఇలా పరిస్థితులు రాష్ట్ర రాజకీయాల్లో ఉండబోతాయని ముందస్తుగా ఊహించి గీసిన కార్టూన్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.