విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి మద్దతు తెలిపినందుకు ఆ పరిశ్రమ కార్మికులు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు, మంత్రి కేటీఆర్‌కు పాలాభిషేకం చేశారు. ఆయన మద్దతు ఇవ్వడంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ తెలుగువారి ఐక్యత వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. తెలుగువారందరం కలిసి పోరాడి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్నారు.
అడ్డుకోకపోతే రాష్ట్రాలను ప్రైవేటు పరం చేస్తారు..
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మద్దతు తెలుపుతున్నట్లు నిన్న మంత్రి కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేగాక కేసీఆర్ అనుమతితో అవసరమైతే అక్కడకు వెళ్లి ప్రత్యక్ష్య ఉద్యమంలో కూడా పాల్గొంటామని అన్నారు. దీన్ని వ్యతిరేకించక పోతే రేపు బీహెచ్ఈఎల్ , సింగరేణిలను, ఆ తర్వాత రాష్ట్రాలను కూడ కేంద్రం ప్రైవేటు పరం చేస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మే క్రమంలో తెలంగాణకు అన్యాయం జరిగితే ఆంద్రావాసులు తమతో కలిసి రావాలని కోరారు.
Also Read : కేసీఆర్, కేటీఆర్ బొమ్మలను ఆ ప్లేస్‌లో వేసుకున్నాడు!