ఈ రోజు ఉదయం మచిలీపట్నంలో పోలీసులు అరెస్టు చేసిన మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. ఆయన నివాసంలో రవీంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల అనంతరం జిల్లా కోర్టుకు తరలించారు. పోలీసులు ప్రొసీజర్ ఫాలో కాలేదని అభిప్రాయపడిన న్యాయమూర్తి రవీంద్రకు బెయిల్ మంజూరు చేశారు. నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగంపై పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
అక్రమ అరెస్టులకు భయపడను..
కాగా, అక్రమ అరెస్టులకు భయపడేది లేదంటూ తనను అరెస్టు చేసిన సందర్భంగా రవీంద్ర అన్నారు. పోలింగ్ సందర్భంగా జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు.
Also Read :వెండి సింహాల చోరీ కేసును చేధించిన పోలీసులు