బీహార్ రాష్ట్రానికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ)తో కలిసి బీజేపీ ఈ ఎన్నికల బరిలోకి దిగుతోంది. మరోమారు అధికార పగ్గాలు చేపట్టాలని నితీష్ కుమార్ పట్టుదలతో ఉన్నారు. సుదీర్ఘ కాలం అధికారానికి దూరంగా ఉన్న ఆర్జేడి-కాంగ్రెస్ కూటమి ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో తమ క్యాంపైన్ కోసం బీజేపీ ఓ పాటను విడుదల చేసింది. ‘బీహార్ మే కా బా’ అంటూ సాగే పాటను బీజేపీ విడుదల చేసింది. ట్యూన్ అద్భుతంగా ఉండటంతో బీహార్ ప్రజలకు ఈ పాట అద్భుతంగా నచ్చేసింది. ఈ పాటకు మంచి రెస్సాన్స్ రావడంతో బీజేపీ వర్గాలు ఫుల్ హ్యాపీగా ఉన్నాయి. ఈ సందర్భంలో ప్రముఖ దర్శకుడు అనుభవ్ సిన్హా ఈ పాట కాపీ అంటూ విమర్శలు చేశారు.
‘దస్’, ‘రా.. వన్’, ‘తప్పడ్’, ‘ఆర్టికల్ 15’ లాంటి సినిమాలతో అభిరుచి గల దర్శకుడిగా అనుభవ్ సిన్హా పేరు తెచ్చుకున్నారు. ప్రముఖ నటుడు మనోజ్ వాజ్పాయ్ తో కలిసి ఆరు వారాల కిందట తాను విడుదల చేసిన ‘బాంబే మే కా బా’ పాటనే బీజేపీ కాపీ కొట్టిందని ఆయన విమర్శలు చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. తాను విడుదల చేసిన పాట లింక్ కూడా ఆయన ఇచ్చారు. ” ఈ విషయం చెప్పకూడదని అనుకున్నాను. కానీ చెప్పకుండా నేను ఉండలేను. కాపీ అంటూ బయటికి చెప్పవద్దని నన్ను నా సహచరులు, స్నేహితులు హెచ్చరించారు. నా క్షేమం కోసం హెచ్చరించిన వారందిరికీ నా ధన్యవాదాలు. కానీ నిజాన్ని బయటికి చెప్పాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని చెబుతున్నాను.
కొన్ని రోజుల కిందట బీజేపీ ‘బీహార్ మే కా బా’ అంటూ ఓ పాటను విడుదల చేసింది. ఈ పాట నేను విడుదల చేసిన బాంబే మే కా బాని కాపీ కొట్టారు. ఈ పాటకు సంబందించి సర్వ హక్కులు నా వద్ద ఉన్నాయి. నన్ను సంప్రదించడం గాని, అనుమతి తీసుకోవడం గాని జరగలేదు. ఎటువంటి సమాచారం లేకుండా నా పాటను మక్కీకి మక్కీ దింపేశారు. వేరేవారి హక్కులను బీజేపీ ఎలా హరిస్తుందనేది ఇదే మంచి ఉదాహరణ. బీజేపీ ఈ దేశాన్ని పరిపాలిస్తోంది. ఇలాంటి విషయంలో బీజేపీ జాగ్రత్తలు తీసుకోవాలి. నా కోరిక ఒక్కటే ‘బీహార్ మే కా బా’ పాటకు నాకు క్రెడిట్ ఇవ్వాలి. బీజేపీ అభిమానులు నన్ను ట్రోలీ చేయకుండా ఉండాలి” అంటూ ఆయన సుదీర్ఘమైన వివరణను పోస్ట్ చేశారు.
అనుభవ్ సిన్హా అనుకున్నట్లే అయింది. ఆయనను బీజేపీ అభిమానులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అనుభవ్ సిన్హానే తమ పార్టీ సాంగ్ ను కాపీ కొట్టారంటూ వారు కామెంట్ చేస్తున్నారు.
Please listen to this song. This doesn't even use the word Bihar once. @BJP4India #bambaimeinkaba https://t.co/4nwDct8zUg pic.twitter.com/vJLkF13FWQ
— Anubhav Sinha (@anubhavsinha) October 14, 2020











