విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో ఏపీలో బీజేపీ భూ స్థాపితం ఖాయమా?
విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేయాలని కేంద్రం చూస్తుంది. ఆంధ్రుల సెంటిమెంట్ గా ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ.. ఊరుకోం అని గత ఏడాది నుంచి కార్మిక సంఘాలు దీక్షలు చేస్తోంది. కేంద్రం చేతులు కీలుబోమ్మగా మారిన ఏపీ ప్రభుత్వం.. వెనకుండి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణకు పరోక్షంగా మద్దతిస్తోందన్న ఆరోపణలు ప్రత్యక్షంగానే వినిపిస్తున్నాయి. ఒక రాజకీయ అవకాశం వాదం, చారిత్రాత్మక తప్పిదానికి తెరతీసింది .. అదే రాష్ట్ర విభజన! కేంద్రం మాటలకు తలొగ్గి కాంగ్రెస్ చేసిన కుటీల రాజకీయానికి బలైపోయింది ఆంధ్రులే! నేడు లోటు బడ్జెట్, నీటి సమస్యలు, కొత్త పరిశ్రమల స్థాపనలో తలెత్తుతున్న ఇబ్బందులు, అసంబద్ధంగా పడి ఉన్న ప్రాజెక్ట్ లు ఇలా అనేకం ఏపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాష్ట్రాల హక్కులపై పెద్దన్న పాత్రపోషిస్తున్న కేంద్రం ఇటువంటి వాటిపై దృష్టిసారించకుండా, ఇంకా ఆంధ్రులకు తీవ్ర అన్యాయం చేయాలని చూస్తోంది. దీనిని ఏపీ ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో సహించరు. ఒకప్పుడు ఏపీ ప్రజల ఉసురు తీసి, కాంగ్రెస్ మట్టి కొట్టుకుపోయింది. నేడు బీజేపీ పరిస్థితి కూడా అంతే! ఏపీలో 2 శాతం కన్నా తక్కువ ఓటు బ్యాంకున్న బీజేపీ, చూపుతున్న వివక్ష కారణంగా జీరోకు పడిపోయినా ఆశ్చర్యమేమి లేదు అన్నది విశ్లేషకులు వాదనలు! రాజకీయ స్వార్థప్రయోజనాల కోసం ఆనాడు కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాల విభజనతో ఏపీకి తీరని అన్యాయం చేస్తే.. ఆర్ధిక వెన్నుదండుగా ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ కుట్రలు చేస్తోంది. ఇది క్షమించరాని రాజకీయ తప్పిదం అని బీజేపీకి తెలిసివచ్చే రోజు చాలా దెగ్గర్లో ఉంది అని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
జిందాల్ సంస్థకు కట్టబెట్టేందుకు పావులు!
కేంద్రంలో అధికారంలో బీజేపీ కార్పోరేట్ రంగాలకు దాసోహం అంటుంది. ఈ మధ్య రైతాంగాన్ని వెన్ను విరిచేందుకు నల్ల చట్టాలను తీసుకొచ్చి బీజేపీ లెంపలేసుకుంది. దేశ చరిత్రలో ప్రధాని స్థాయిలో వ్యక్తి ప్రజలను క్షమించండి అని వేడుకున్న దాఖలు ఎన్నడూ లేదు. అటువంటి పరిస్థితి బీజేపీ కావాలనే తెచ్చుకుంది. ప్రస్తుతం ఏపీ లోని విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. విశాఖ స్టీల్ ను కొనేందుకు జిందాల్ పెద్ద ఆఫర్ ఇస్తున్నట్లు అందుతున్న సమాచారం. విశాఖ స్టీల్ ప్లాంట్ తో పాటు నాగర్నార్ ప్లాంట్ ను కూడా దక్కించుకునేందుకు జిందాల్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఏటా 7.3 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం ఉన్న విశాఖ ఉక్కును దక్కించుకునేందుకు ఆశసక్తిగా ఉంది జిందాల్ కంపెనీ! మరోవైపు ఉక్కు పరిశ్రమను అమ్మెందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కార్మికులు, ప్రజా సంఘాలు ఎన్ని ఆటంకాలు సృష్టించిన అమ్మకం మాత్రం తథ్యం అంటోంది కేంద్రం. కాదుకూడదు అని ఏపీ ప్రజలు సెంటిమెంట్ గా భావిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను బీజేపీ ప్రైవేటీకరణ చేస్తే.. తదననంతరం మారిన రాజకీయ పరిణామ క్రమంలో ఏపీలో ఆ పార్టీ తుడిచిపెట్టుకుని పోతుందన్న హెచ్చరికలు లేకపోలేదు!











