నీవెవ్వడివైతే నాకేంటి?
అది ఫ్రిబవరి 15 అర్థరాత్రి విజయవాడ కృష్ణలంక పీఎస్ పరిధి.. ట్రిపుల్ రైడింగ్ తో పాటు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న ముగ్గుర్ని ఎస్ఐ ఆపగా.. ఆయన పట్ల ఆ యువకులు దురుసుగా ప్రవర్తించారు. అంతేకాక మేము ఎంపీ నందిగం సురేష్ అనుచరులంటూ హల్ చల్ చేశారు. దీంతో విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ వారిని మందలించారు. అక్కడ నుంచి స్టేషన్ కు వాళ్లును తీసుకెళ్లారు. దీంతో స్టేషన్ కు స్వయానా ఎంపీ సురేష్ తన అనుచరులతో వెళ్లి నానా హంగామా చేశారు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ పై దాడి చేశారు. స్టేషన్ ఫర్నిచర్ ధ్వసం చేయడంతో పాటు ఎస్ఐ, హెచ్ కానిస్టేబుల్ పై కూడా దాడులు చేశారు. నోటికొచ్చినట్ల దుర్భాషలు ఆడారు. అయితే ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి అలా స్టేషన్ పై తన అనుచరులతో వచ్చి.. ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పై దాడిచేసి మరి తప్పు చేసిన వారిని తీసుకుపోవడం వంటి చర్యలు చర్చనీయాంశంగా మారింది. కానీ మాదేమి తప్పులేదు.. కేవలం పోలీసులదే తప్పు అంటూ ఎస్ఐ మందలించే వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి, సానుభూతి సంపాదించే అధికార వైసీపీ చేసి ప్రయత్నం సిగ్గు చేటని విపక్షాలు మండిపడుతున్నాయి.
మా అనుచరులపై ఎస్ఐ దాడి చేశాడు!
లా అండ్ ఆర్డర్ అదుపు తప్పకుండా బ్యాలెన్స్ గా నడవాలంటే పోలీసులు ఒక అడుగు ముందుకేసి, లాఠీలు జులిపించాల్సిందే! అంతేకాని రోడ్డుపై పోయే ప్రతివాడు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పేరు చెప్పుకుంటూ పోలీసులను బెదిరిస్తే, చేతులు కట్టుకుని పోలీసులు ఉండాలా? అని సోషల్ మీడియాలో అధికార వైసీపీపై ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు! ఒకే ద్విచక్ర వాహనంపై నిబంధనలకు విరుద్ధంగా ముగ్గుర్ని ఎక్కించుకుని, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే పోలీసులు కళ్లు మూసుకోవాలి. అంతేకానీ వారిని ఆపకూడాదు. ఎంపీ నందిగం సురేష్ పేరు చేబితే వదిలేయాలి.. అంతేకానీ వారిని మందలించకూడదు. చేతులు కట్టుకుని మీరు వెళ్లండి బాబుగారు అంటూ మార్గం చూపాలా అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. ఇదేనా అదికార వైపీసీ ఇలాకాలో సాగే దౌర్జన్యకాండ అని మండిపడుతున్నారు! స్టేషన్ పై పడి పోలీసులను కొట్టి, ఫర్నిచర్ ధ్వంసం చేస్తే.. ఆ ఘటనను వీడియో తీస్తున్న కానిస్టేబుల్ పై దాడిచేయడమే కాకుండా సెల్ఫోన్ లాక్కొని, వీడియోలను డిలెట్ చేశారు. కానీ పోలీసులే తప్పు చేసినట్లు ఎస్ఐ చేయి చేసుకునే వీడియోలను అధికార వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో ఫోస్ట్ చేసి, పోలీసులను బ్లేమ్ సరైనా పద్దతి కాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరిగినా.. పోలీసులపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఇంకా ఎటువంటి కేసు నమోదు కాకపోవడం గమనార్హం!
Must Read:-గుడివాడలో హై టెన్షన్.. బోండా ఉమ కారుపై రాళ్ల దాడి! టీడీపీ నేతలు అరెస్ట్!!











