ఎన్నికల్లో వలంటీర్ల వ్యవహారాలకు సంబంధించి రాజకీయ పార్టీలు, ప్రజలు, ప్రసార సాధనాల ద్వారా తమకు ఫిర్యాదులు అందుతున్నాయని, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిన వలంటీర్లపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. ఎవరైనా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తే తమకు ఫిర్యాదు చేయాలని పేర్కొంది. కమిషన్ పరిధిలో ఫిర్యాదుల స్వీకరణకు 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏ వలంటీరు అయినా నియమావళికి విరుద్ధంగా పనిచేస్తే కాల్ సెంటర్ నెంబరు 0866 – 2466877కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో , మున్సిపల్ కార్యాలయాల్లో హెల్స్‌లైన్లు, కాల్ సెంటర్లు పనిచేస్తున్నాయని, వాటికి కూడ ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.ఎన్నికల నిర్వహణపై ఓటర్లలో విశ్వాసం కల్పించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కమిషన్ పేర్కొంది.
Must Read ;- ఓట్లు పడక పోతే ఉద్యోగం ఊస్టే.. అడకత్తెరలో వలంటీర్లు











