మెగాస్టార్ మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న మూవీ ఉప్పెన. ఈ చిత్రం ద్వారా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీ 2020 సమ్మర్ లో రిలీజ్ కావాలి కానీ.. కరోనా కారణంగా ఆగింది. దీంతో ఉప్పెన సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తారని టాక్ వచ్చింది కానీ.. హీరోగా మొదటి సినిమా కాబట్టి థియేటర్ లోనే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.
త్వరలో ఉప్పెన ధియేటర్లోకి వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ కాకుండా వైష్ణవ్ తేజ్.. క్రిష్ డైరెక్షన్ లో ఓ సినిమా చేసారు. ఇందులో వైష్ణవ్ తేజ్ – రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించారు. వికారాబాద్ ఫారెస్ట్ నేపధ్యంలో రూపొందిన ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. హీరోగా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే వైష్ణవ్ తేజ్ తో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు రెండు సినిమాలకు వైష్ణవ్ తేజ్ ఓకే చెప్పాడని తెలిసింది. ఇంతకీ ఆ రెండు సినిమాలు ఏంటంటే.. ఒకటి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మించే సినిమా కాగా, మరొకటి సైన్ స్క్రీన్స్ బ్యానర్ పై రూపొందే చిత్రం. ఈ రెండు చిత్రాలను ఈ సంవత్సరంలోనే కంప్లీట్ చేయనున్నట్టు సమాచారం. మొత్తానికి హీరోగా ఒక సినిమా కూడా రిలీజ్ కాకుండానే.. వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యాడు వైష్ణవ్ తేజ.