పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం అనే మాటం మనం వినే ఉంటాం. ఈ మంత్రం సందీప్ కిషన్ కు ఒంటబట్టినట్టే ఉంది. తనకున్న హోటల్ పేరుతోనే సినిమా చేయాలన్న ఆలోచన సందీప్ కు కలిగింది. వెంటనే దాన్ని ఆచరణలో పెట్టేశాడు. హీరోలు నిర్మాతలుగా మారడం ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండ్ అయిపోయింది. అగ్ర హీరోలే కాదు చోటా మోటా హీరోలు కూడా సినీ నిర్మాణంలోకి అడుగు పెడుతున్నారు. ఈ బ్యాచ్ లోకి ఇటీవలే సందీప్ కిషన్ కూడా వచ్చేశాడు. ‘నిను వీడని నీడను నేనే’ అనే సినిమాతో చిత్ర నిర్మాణంలోకి అడుగు పెట్టిన సందీప్ తాజాగా మరో సినిమాకు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యారు.
సందీప్ కిషన్‌లో అభిరుచి గల నిర్మాత, మంచి భోజన ప్రియుడు ఉన్నారు. ప్రజలకు రుచికరమైన భోజనం, వంటలు వడ్డించడానికి ‘వివాహ భోజనంబు’ అని హైదరాబాద్ నగరంలో, తెలుగు రాష్ట్రాల్లో రెస్టారెంట్లు ప్రారంభించి తమ సేవలు అందిస్తున్నారు. ఈ రెస్టారెంట్లు ప్రజల అభిమానాన్ని చూరగొన్నాయి. ఇప్పుడు ‘వివాహ భోజనంబు’ అని ఓ సినిమా నిర్మించడానికి సందీప్ కిషన్ శ్రీకారం చుట్టారు.
ఐతే నిర్మాతగా మారిన సందీప్ కి తాను నిర్మించిన మొదటి సినిమాతో హిట్ వచ్చింది. ఇదే చిత్రంలో హీరోగా కూడా నటించాడు సందీప్. దీంతో చిరకాలంగా తనకు దక్కాల్సిన హిట్ కూడా సందీప్ ఖాతాలోకి వచ్చి చేరింది. అంటే అటు నిర్మాతగా ఇటు హీరోగా కూడా సక్సెస్ అయ్యాడు సందీప్ కిషన్. దీంతో సందీప్ కి మంచే జరిగినప్పటికీ, తాను పెట్టుబడి సినిమా కాబ్బటి నిను వీడని నీడను నేను సినిమాకి కాస్త ఎక్సట్రా కేర్ తీసుకున్నాడని, బయట వాళ్లు తీసే సినిమాకి మనోడు అంత దృష్టి పెట్టాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
దీనికి తోడు నిను వీడని నీడను నేను తరువాత సందీప్ రెండు సినిమాలు చేశాడు, ఇవీ రెండు బయటవాళ్ళు నిర్మించడం, అవి ప్లాప్ అవ్వడంతో, సందీప్ పై వచ్చిన కామెంట్స్ కి రుజువులు దొరికినట్లయింది. ఇదే ఎఫెక్ట్ ఇప్పుడు సందీప్ నిర్మిస్తున్న రెండో సినిమా పై కూడా వచ్చి పడింది. నిర్మాతగానే కాదు హీరో గా కూడా హిట్ కొట్టాలి సందీప్ అంటూ సెటైర్లు ప్రస్తుతం ఈ అప్ కమింగ్ హీరో పై వినిపిస్తున్నాయి.