`బ్యాక్ డోర్’ తెరవడం వల్ల ఎలాంటి విచిత్ర పరిణామాలు ఎదురయ్యాయన్న అంశాన్ని ప్రధాన కదావస్తువుగా తీసుకుని `బ్యాక్ డోర్’ పేరుతోనే ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలలో నటించడంలో పూర్ణకు మంచి పేరుంది. ఈ చిత్రంలో కూడా ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. యువ కథానాయకుడు తేజ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. కర్రి బాలాజీ దర్శకుడు. ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ పూర్తయింది. క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంది.
ఈ సందర్భంగా దర్శకుడు కర్రి బాలాజీ మాట్లాడుతూ, “ఎలాంటి పాత్రలోనైనా చక్కటి అభినయాన్ని కనబరచగల నటిగా పేరున్న పూర్ణ ఈ చిత్రంలో కూడా తన పాత్రలో ఎంతగానో ఒదిగిపోయారు. చాలా మంచి పేరు తెచ్చిపెట్టే పాత్రను ఆమె చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో . నటిస్తున్నప్పుడే నందమూరి బాలకృష్ణగారి చిత్రంలో నటించే అవకాశం ఆమెను వరించింది. అలాగే కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న జయలలిత బయోపిక్ లో శశికళగా నటించే అవకాశం కూడా ఆమెకు లభించడం ఆనందదాయకం. పూర్ణతో పాటు యూనిట్ అంతటికీ పేరు తెచ్చిపెట్టే చిత్రమవుతుంది” అని అన్నారు.
‘నిర్మాత బి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ‘నటీనటులు, సాంకేతిక నిపుణుల నుంచి దర్శకుడు బాలాజీ మంచి అవుట్ పుట్ రాబట్టుకుంటున్నారు” అని వివరించారు. హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ, “ఇందులో అంజలి. అనే పాత్రలో కనిపించబోతున్నాను. నాకంటే చిన్న వయసున్న అబ్బాయిని ప్రేమించే అమ్మాయిగా నా పాత్ర స్వభావం ఉంటుంది. పాత్ర ఛాలెంజింగ్ ఉంది” అని అన్నారు.’పూర్ణతో కలిసి ఈ సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది. అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు” అని హీరో తేజ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రీకాంత్ సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్, ఆర్ట్: నాని, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్.











