వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తున్నట్లుగా కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. మోటార్ల కు మీటర్లు బిగిస్తే తాము నష్టపోతామని రైతులు వాపోతున్నారు. మీటర్లు బిగిస్తే కనుక ఉద్యమాలు చేపడతామని కొన్ని రాజకీయ పార్టీల నాయకులు అన్నారు. వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
బిగించకుండా అడ్డుకోవాలి కానీ..
ఉచిత విద్యుత్ వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించకుండ అడ్డుకోవాలి కానీ బిగించిన తరువాత ఉద్యమాలు చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అంటున్నారు రైతులు. మా తరఫున ఏ రాజకీయ పార్టీ ఉద్యమాలు చేసినా..ముందుగానే చేయాలి కానీ అంతా అయిపోయిన తరువాత చేస్తే ఎలాంటి ఫలితం ఉండదని రైతులు పేర్కొన్నారు.
మీటర్లు బిగించేసిన తరువాత ‘మేం పోరాడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది’ అని చెప్పుకోవడానికి తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని వివరించారు. రైతులకు ఉపయోగపడని ఉద్యమాలు ఎన్ని చేసినా పనికిరావు అని రైతులు పేర్కొంటున్నారు.
రాజకీయ పార్టీల నాయకులు ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని పోరాటాలు చేసినా అవి రైతులకు ఉపయోగపడేలా ఉండాలే తప్ప మీ గొప్పలు చెప్పుకోవడానికి పనికి వచ్చే విధంగా ఉండకూడదు అంటూ కొందరు రైతులు మీడియా ఎదుట వాపోయారు.
ఇప్పటికే వరదల కారణంగా పంటలు నష్టపోయి ఆర్థికంగా కుదేలు అయిన రైతుల మీద మీటర్లు బిగించడం అనేది మరో ఆర్థిక భారాన్ని మోపినట్లే అవుతుందని తెలుస్తుంది. ఇప్పటికైనా ఈ విషయయం మీద ప్రభుత్వం మరోసాని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని రైతులు కోరుతున్నారు.
ఉచిత విద్యుత్తు పొందుతున్న ఏ ఒక్క రైతుకు కూడా నష్టం జరగదని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ.. ఇలాంటి హామీలు ఇచ్చే బదులు అసలు పెట్టకుండా ఉంటే మేలు చేసిన వారు అవుతారు కదా.











