‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్ టాప్ లీగ్ కు చేరుకుంది. ఆ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్ కి లెక్క ప్రకారం.. ఆమె ఈ పాటికి మహా మహా హీరోల సరసన నటించి.. టాప్ హీరోయిన్ గా సెటిల్ అయిపోవాలి. కానీ సీన్ మరోలా టర్న్ అయింది. ఆ సినిమా తర్వాత ఆమె ఫోకస్ అంతా.. లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్స్స్ మీదే పెట్టింది. దాని వల్ల అమ్మడి కెరీర్ గాడి తప్పే ప్రమాదముందని ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మధ్యలో తమిళ హీరోలు విజయ్, సూర్య, విశాల్, విక్రమ్ లాంటి హీరోలతో నటించినా అంతగా ప్రయోజనం లేకపోయింది.
నాగార్జున‘ మన్మథుడు 2’ లో కేమియో అపీరెన్స్ తో మెప్పించినా వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం మహేశ్ బాబు తో ‘సర్కార్ వారి పాట’, రజనీకాంత్ తో ‘అన్నాత్తే’, పవన్ కళ్యాణ్ తో ‘ఓం శివమ్’ ( టైటిల్ ఇంకా ఖాయం కాలేదు) సినిమాల్లో నటిస్తోంది. అంత వరకూ బాగానే ఉంది. అయితే ఈ టైమ్ లో ‘మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి’ లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ను రిలీజ్ కు సిద్ధం చేస్తోంది. ఈ సినిమాలు రెండూ హిట్టయితే పర్వాలేదు. కాని పక్షంలో దాని ప్రభావం .. పెద్ద హీరోల సినిమాల మీద అంతో ఇంతో ఉంటుంది.
అయితే అలా జరగకుండా ఉండాలంటే.. నితిన్ సరసన హీరోయిన్ గా నటించిన ‘రంగ్ దే’ సినిమా సూపర్ హిట్టయి తీరాలి. ప్రస్తుతం స్టార్ హీరోల సరసన వరుస సినిమాల్ని లైన్ లో పెట్టుకున్న కీర్తి సురేశ్ .. ‘రంగ్ దే’ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుంది. మిస్టర్ మజ్నుతో ఫ్లాప్ టేస్ట్ చేసిన వెంకీ అట్లూరి ఈ సినిమాతో ఎలాగైనా హిట్ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తే.. కీర్తికి పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు వరుసగా లభిస్తాయి. మరి మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ సినిమాలతో పాటు రంగ్ దే కూడా మంచి సక్సెస్ సాధిస్తే.. కీర్తి.. కీర్తి ఇంకేరేంజ్ లో పెరుగుతుందో చూడాలి.











