పున్నామ నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడు అని శాస్త్రాలు చెబుతాయి. అలాగే.. ప్రతి ఇంటా ఆకాశమే హద్దుగా అల్లరి చేస్తూ.. తన నవ్వులతో పున్నమి వెన్నెలను కురిపించేది కూతురని కూడా చెబుతారు. అలాంటిది ఒకే ఇంట్లో కూతురు, కొడుకు ఉంటే ఆ ఇల్లు ఆనంద నిలయమే కదా. ఈ విషయంలో చాలా అదృష్ణ వంతుడు మెగా బ్రదర్ నాగబాబు. వరుణ్ తేజ, నీహారిక ఆయన ముద్దుల సంతానం అన్న సంగతి తెలిసిందే. ఆ ఇద్దరితోనూ తన లైఫ్ ను ఆనందంగా గడుపుతున్నారు ఆయన.
ఈ నేపథ్యంలో డాటర్స్ డే సందర్భంగా కూతుళ్ళ పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు నాగబాబు. తన కూతురు నీహారిక తో ఫన్నీ మూమెంట్స్ ను షేర్ చేస్తూ డాటర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన నాగబాబు.. ‘కూతుళ్ళంటే మనం కలలు కనే చిట్టి దెయ్యాలే. వాళ్ళే కూతుళ్ళ రూపంలో ఈ భూమ్మీదకు వస్తారు. మనల్ని నవ్వించేందుకు, ఆటపట్టించేందుకు, ఏడిపించేందుకు, చిరాకు తెప్పించేందుకు మొత్తానికి మనల్ని ప్రేమలో పడేసేందుకు మొత్తానికి మన ఇంటికి వస్తారు. హ్యాపీ డాటర్స్ డే టు మై డ్రీమ్ డెవిల్’ అంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. దాంతో ఆ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయిపోయింది. నెటిజెన్స్ ఆయన కామెంట్స్ కు చాలా పాజిటివ్ గా స్పందిస్తూ.. కూతురు పట్ల నాగబాబు ప్రేమను, ఆయన పితృ వాత్సల్యాన్ని అభినందిస్తున్నారు.
నాగబాబుకి తన కూతురంటే ప్రాణమని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. అలాగే.. ఆయనకి, నీహారికకి మధ్య ఏ విధమైన బాండింగ్ ఉంటుందో చాలా సార్లు జబర్దస్త్ ఎపిసోడ్స్ లోనూ, ఇతర కార్యక్రమాల్లోనూ ప్రాక్టికల్ గానూ చూపించారు. అలాంటి నీహారికకి ఇటీవలే ఎంగేజ్ మెంట్ జరిగింది. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావు కొడుకు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నీహారిక జీవితాన్ని పంచుకోబోతోంది. ఆ సందర్భంగా.. కాబోయే భర్తతో నీహారిక దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్ళి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోనున్న ఆ కలల చిట్టి దెయ్యం సందడి, ఆమె అల్లరి సవ్వడి ఇక పై నాగబాబు ఇంట్లో వినిపించవు. మరి దానికి ఆయన ఎంతగా బెంగపెట్టుకుంటారో చూడాలి.











