సాధారణంగా ప్రమాణస్వీకారం ఎవరైనా ఎలా చేస్తారు… మాతృభాషలో రాసిన ప్రతిని చదివి ప్రమాణస్వీకారం చేస్తారు. కానీ ఇక్కడో మహిళ మాతృభాష అయిన తెలుగును పక్కనపెట్టి, ఇంగ్లీషులో ప్రమాణ స్వీకారం చేసింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా కౌన్సిలర్ ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేయడం అందర్నీ ఆకట్టుకుంది. 18వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన చలపాది మహాలక్ష్మి గురువారం ఇంగ్లిష్‌లో ప్రమాణ పత్రం చదివి బాధ్యతలు తీసుకున్నారు. అధికారులు మాత్రం తెలుగు కాపీని అందించినప్పటికీ, ఈమె మాత్రం ఆ పత్రాన్ని ఇంగ్లీషులోకి ట్రాన్స్ లేట్ చేసుకొని ప్రమాణ స్వీకారం చేయడం అందరిని ఆకట్టుకుంది.