తమిళ నటి వీజే చిత్ర మరణంలోని చిక్కుముడి ఇంకా వీడలేదు. పోలీసులు మాత్రం ఇది ఆత్మహత్యగానే తేల్చేశారు. దీన్ని చిత్ర తల్లి అంగీకరించడం లేదు. చిత్రను ఆమె భర్తే కొట్టి చంపాడని ఆరోపిస్తోంది. వీరిద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారన్నది మాత్రం స్పష్టమవుతోంది. వచ్చే ఏడాది జనవరిలో పెళ్లి చేసుకుని ఫిబ్రవరి ఓ గ్రాండ్ విందు ఏర్పాటు చేయాలని కూడా అనుకున్నారు.
చిత్ర మొహంపై గాట్లు ఉన్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఆమె మొహం మీద, చెంప మీదా గాట్లు ఉండటంతో ఇది హత్య అనే ఊహాగానాలు బలపడ్డాయి. ఆమె తల్లి కూడా మీడియాతో మాట్లాడుతూ చిత్ర ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమె చాలా ధైర్యవంతురాలని వివరించారు. ఆమె భర్త హేమంతే కొట్టి చంపాడని ఆమె అంటున్నారు. ఇటీవల చిత్ర నిశ్చితార్థం అయినప్పుడు కూడా ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
ఈ కేసులోని చిక్కుముడి విడిపోవాలంటే ఆమె ఫోన్ సంభాషణలు బయటికి వస్తేగాని తెలియదు. లేదా ఆ రాత్రి చిత్రకూ, హేమంత్ కూ మధ్య ఏ విషయంలో గొడవ జరిగిందన్నది కూడా తెలియాల్సి ఉంది. హేమంత్ ఫైనాన్సర్ అని కూడా తెలుస్తోంది. కేసును ఏదో విధంగా మాఫీ చేయటానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
Must Read ;- ‘చిత్ర’ విచిత్రమైన ప్రశ్నలు మిగిల్చిన మరణం?