ఇప్పుడు ఇటు టాలీవుడ్లోను .. అటు కోలీవుడ్లోను ఒక వార్త జోరుగా షికారు చేస్తోంది. ‘సలార్‘ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి చేయనున్నాడనేది ఆ వార్త సారాంశం. ప్రభాస్ తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి ‘రాధేశ్యామ్‘ సినిమా ముస్తాబవుతోంది. ఆ తరువాత సినిమాగా ప్రభాస్ ‘సలార్’ చేస్తున్నాడు. ‘కేజీఎఫ్‘ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్, ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా ‘సలార్’ నిర్మితమవుతోంది.
ఇటీవలే ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను గోదావరిఖని బొగ్గుగనుల్లో మొదలుపెట్టారు. అక్కడ ప్రభాస్ కాంబినేషన్లోని కొన్ని ముఖమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో ప్రభాస్ తో తలపడే విలన్ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. అందువలన విలన్ పాత్ర కోసం కొంతమంది సీనియర్ స్టార్ హీరోల పేర్లను పరిశీలించారు. ఫైనల్ గా విజయ్ సేతుపతిని తీసుకునే ఆలోచన చేస్తున్నారట. విలన్ పాత్రకి సంబంధించిన పేర్ల పరిశీలన ఆయన దగ్గరే ఆగిందని చెబుతున్నారు.
విజయ్ సేతుపతి మంచి నటుడు అనే విషయంలో ఎవరికి ఎలాంటి సందేహం లేదు. హీరోగానే కాదు .. విలన్ గా కూడా ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఇటీవల వచ్చిన ‘మాస్టర్‘ సినిమాలో ఆయన విలనిజం ప్రేక్షకులకు ఒక రేంజ్ లో నచ్చేసింది. హీరో పాత్రతో సమానమైన క్రేజ్ ఆయన పాత్రకి లభించడం విశేషం. ఈ పాత్రలో ఆయన యాక్టింగ్ చూసిన తరువాతనే ప్రశాంత్ నీల్ ‘సలార్’ విలన్ పాత్రను ఆయనకి ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నాడని అంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను బరిలోకి దింపుతారట.
Also Read: ఇక ఓటీటీలో దుమ్మురేపనున్న;మాస్టర్











