ఏపీకి పరిశ్రమలు తెచ్చేందుకు ఓ వైపు చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే..మరోవైపు ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు వైసీపీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. గతంలో ఏపీలో పెట్టుబడులు పెట్టోద్దంటూ పలువురు పారిశ్రామిక వేత్తలకు వైసీపీ ఈ-మెయిల్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశం అప్పట్లో సంచలనంగా మారింది. ఐతే ఇప్పుడు చంద్రబాబు బృందం సింగపూర్ పర్యటనపై వైసీపీ నేతలు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో కోడిగుడ్డు మంత్రిగా ట్రోల్స్ ఎదుర్కొన్న మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్‌నాథ్ చంద్రబాబు సింగపూర్ పర్యటనపై విమర్శలు చేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు సింగపూర్ వెళ్ళడానికి ఏకైక కారణం అక్కడ పెట్టుబడి పెట్టడం ద్వారా తన అక్రమ డబ్బును కాపాడుకోవడమేనంటూ కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేశారు గుడివాడ అమర్‌నాథ్. ఐతే అమర్‌నాథ్ ఆరోపణలను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అమర్‌నాథ్ ఓ ట్రోల్ మెటిరీయల్‌గా మారిపోయారు.
గతంలో ఐటీ శాఖ మంత్రిగా పని చేసిన టైంలో అమర్‌నాథ్ పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు ఆయనను జోకర్‌ను చేశాయి. దావోస్‌లో చలిగా ఉంటుంది కాబట్టి తాము పెట్టుబడుల సదస్సుకు వెళ్లలేదంటూ అమర్‌నాథ్ గతంలో చేసిన వ్యాఖ్యలు సైతం సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ఏపీని మళ్లీ తిరిగి అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు 70 ఏళ్ల వయసులో చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను మెచ్చుకోకపోగా..విమర్శలు చేయడం సరికాదంటున్నారు విశ్లేషకులు. వైసీపీ ఇప్పటికైనా తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని సూచిస్తున్నారు.











