జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రమంతట అరెస్ట్ ల పర్వం కొనసాగుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసాన్ని గుర్తు చేసినా.., ప్రశ్నించినా.. అక్రమ కేసులు పెట్టి కటకటాల పాలు చేయడం పరిపాటిగా మారింది.
ఏపీలో అధికార వైసీపీ.. విపక్షాలపై తన అకృత్యాలు, అక్కసును వెల్లగక్కుతోంది. ప్రశ్నిస్తున్న వారిని టార్గెట్ చేసి.. దాడులు చేస్తున్నారు. దాడులతో లొంగకుంటే అరెస్ట్ చేసి.., మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో రైతులు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.., సాగునీరువ్వండి మహాప్రభో అని వేడుకున్నా.. వారిపై అధికార దౌర్జన్యానికి పాల్పడుతోంది వైసీపీ ప్రభుత్వం.
ఉరవకొండలోని జీబీసీకి సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న రైతులకు స్ధానిక తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మద్దతు తెలిపారు. బళ్ళారి – అనంతపురం జాతీయ రహదారిపై హంద్రీనీవా కాలువ సమీపంలో రైతులతో కలిసి బైఠాయించి.., పయ్యావుల నిరసన వ్యక్తం చేశారు. దీంతో కన్నెర్ర చేసిన ఖాకీలు.. ఆయనను అరెస్ట్ చేసేందకు ప్రయత్నించారు. దీనిపై రైతులు పెద్దఎత్తున ప్రతిఘటించారు. దాదాపు గంటపాటు నడిచిన హైడ్రామా నడుమ పయ్యావులను పోలీసులు అరెస్ట్ చేసి.., కనేకల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అలానే నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ జరుగుతోందని .., దానిని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ.. మాజీ మంత్రి సోమిరెడ్డి దీక్ష చేస్తుంటే.. ఇజ్రాలతో కొట్టించాలసి చూశారు. స్ధానిక వైసీపీ మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి అక్రమ మైనింగ్ పాల్పడుతూ.. జిల్లాలో అత్యంత అవినీతి పరుడిగా మార్క్ వేసుకున్నారని సోమిరెడ్డి ధ్వజమెత్తారు. దీంతో గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే.. భుజాలు తడుముకున్న మాదిరిగా.. మంత్రి కాకాని ఇజ్రాలను రెచ్చగొట్టి సోమిరెడ్డి పై దాడికి ఉసిగొల్పారు. అది వర్కౌట్ కాకపోయే సరికి.. పోలీసులను పంపి దీక్ష భగ్నం చేయించారు.
ఇలా ఏపీలో ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు .., ప్రజాస్వామ్యంపై అధికార వైసీపీ దాడులకు తెగబడుగుతోంది. విపక్షాలు.., సోషల్ మీడియా పై నిత్యం నమోదు అవుతున్న కేసులు వైసీపీ దౌర్జన్య పాలన విధానాలకు అద్దం పడుతున్నాయని విశ్లేషకులు వాపోతున్నారు.











