దివంగత నేత ఎన్టీయార్ అందరివాడు,పేదల దేవుడు అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కొనియాడారు.ఎన్టీఆర్ శతజయంతి సందర్బంగా ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. తెలుగు వారి ఆరాద్యదైవం ఎన్టీఆర్ ని దాడి వీరభద్రరావు స్పష్టం చేశారు.దాడీ కూడా గంతలో టీడీపీ లో పనిచేశారు. ఆనాడు ఎన్టీఆర్, ఆత్వాత నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేసే అవకాశం సభించింది.అయితే నాడు ఎన్టీయార్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి చేరినట్లు ఆయన గుర్తు చేశారు.తనకు ఎన్టీయార్ అనేక సార్లు మంత్రి పదవిని అవకాశం కల్పిచారని గుర్తు చేశారు.
కళా రంగంలో ఎమ్జీయార్ తరువాత దక్షిణాదిన మరొకరికి భారతరత్న ఇవ్వలేదు అని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. ఎన్టీయార్ విఖ్యాతిని ఆయన తెలుగు జాతికి చేసిన సేవను గుర్తుపెట్టుకుని భారతరత్నను ప్రకటించాలని ప్రధాని నరేంద్రమోడిని కోరారు. ఇది ఇలా ఉండాగా ఇక ఎన్టీయార్ ని ఎన్నికల సమయంలోనే టీడీపీ వాడుకుంటోంది దాడి చురకలెట్టారు.. మొత్తానికి చూసుకుంటే ఎన్టీయార్ ని పొగుడుతూ వైసీపీ మాజీ మంత్రి ఆయన పేరిట కార్యక్రమాలు చేయడం మాత్రం వర్తమానంలో చూస్తే రాజకీయ చిత్రంగానే అంతా చూస్తున్నారు.