ఏ నాయకుడైనా ప్రచారానికి వెళ్తే ఏం చేస్తారు… తమ పార్టీ గురించి గొప్పగా మాట్లాడతాడు. కానీ ఇక్కడ ఓ ఎమ్మెల్యే ప్రచారంలో ప్రత్యర్థి పార్టీ పేరు ప్రస్తావించి, ఓటు వేయాలని కూడా కోరాడు. ఈ ఆసక్తికర సంఘటన ఎక్కడ జరిగిందంటే.. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు వైసీపీ ఎమ్మెల్యే ఉప్పాల వాసుబాబు.. తన ప్రత్యర్థి పార్టీ అయిన సైకిల్ గుర్తుకు ఓటేయమంటూ ప్రజలకు పిలుపిచ్చారు. ఎమ్మెల్యే మాటలు విని అక్కడి వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఇదేంటి? వైసీపీ ఎమ్మెల్యే.. సైకిల్ గుర్తుకు ఓటు వేయమంటున్నారేంటి? అని నవ్వారు. మీటింగ్‌కు వచ్చిన వారంతా పగలబడి నవ్వుతుండటంతో.. ఏదో పొరబాటు జరిగుంటుందని సదరు ఎమ్మెల్యేకు అర్థమైంది. వాసుబాబు వెంటనే కవర్ చేసుకునేందుకు ప్రయత్నించారు. జోక్ చేశానని చెప్పుకొచ్చారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎమ్మెల్యే మాటలు వీడియోలో రికార్డ్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ ట్రోల్ అవుతోంది.
Must Read ;- టీడీపీ నేతల నోట కోవర్టుల మాట.. వైసీపీ, బీజేపీల్లో టెన్షన్ !