అధికార ప్రతిపక్షాల్లో ప్రస్తుతం కోవర్ట్ అనే పదం సాధారణమైంది. ఆ పార్టీలో పలనా పార్టీకి చెందిన కోవర్టులున్నారని పరస్పరం ఆరోపణలు చేసుకుంటుంటాయి. అయితే ఆ కోవర్ట్ ఆరోపణలకు బలం చేకూర్చేలా చోటుచేసుకునే సందర్భాల్లో పార్టీలు ఉలిక్కి పడుతుంటాయి. ప్రస్తుతం తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఇదే జరగుతోంది.
బీజేపీలో వైసీపీ కోవర్టులున్నారంటూ..
టీడీపీ రెండు రోజుల క్రితం కొన్ని కీలక విమర్శలు చేసింది. బీజేపీలో వైసీపీ కోవర్టులున్నారని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు విమర్శించారు. అయితే ఆ కోవర్టులు ఎవరనేది డైరెక్ట్‌గా చెప్పకున్నా..కొన్ని సంకేతాలు ఇచ్చారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా..టీడీపీనే సదరు నాయకులు టార్గెట్ చేస్తారని కూడా విమర్శించారు. ఏపీలో కొన్నాళ్లుగా రాజకీయ అంశాలను పరిశీలిస్తున్న వారికి ఎవరికైనా.. ఆ విమర్శలు చేసేవాళ్లు గుర్తొస్తారు. అయితే వారు కోవర్టులా కాదా అనేది ఎవరికీ తెలియదు..కాని వారు నిత్యం టీడీపీని టార్గెట్‌గా, చంద్రబాబును పర్సనల్‌గా తిడుతుండడం, టీడీపీ అధికారంలో ఉందనేట్టు టీడీపీని టార్గెట్ చేయడంపై ఇప్పటికే విమర్శలు వచ్చాయి. కొన్నాళ్ల క్రితం సైలెంట్ అయినా..మీడియాతో మాట్లాడే సమయంలో టీడీపీని ఎప్పుడెప్పుడు తిడదామా అని ఉవ్విళ్లూరుతున్నారన్న కామెంట్లూ వచ్చాయి.
సోషల్ మీడియాలో కామెంట్లు..
అంతేకాదు.. ఈ కోవర్టులుగా సోషల్ మీడియాలో కామెంట్లూ వస్తున్నాయి. ఆ పేర్లను పరిశీలిస్తే గతంలో టీడీపీ సపోర్టుతో ఎమ్మెల్సీ పదవి పొంది మళ్లీ చంద్రబాబునే టార్గెట్ చేసిన ఓ నాయకుడు కాగా, ఏపీలో అధికార పార్టీకి చెందిన ముఖ్య వ్యక్తికి తెలంగాణలో పుట్టి..ఏపీ అల్లుడిగా, ఓ మత ప్రచారకుడిగా ఉన్న బావకి ఏపీ బీజేపీ నేత దగ్గరి బంధువు. ఆర్థిక లావాదేవీలూ భారీగానే ఉన్నాయని ఇప్పటికే ఆరోపణలున్నాయి. ఈయన ఢిల్లీ నుంచి చక్రం తిప్పుతానని చెప్పే వ్యక్తి. ఈ మధ్య బీజేపీ అధిష్టానానికి అనుమానాలు రావడంతో ప్రాధాన్యం తగ్గించారని చెబుతారు. మరో ఇద్దరు వ్యక్తులు కూడా ప్యాకేజీ స్టార్లని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. అందులో ఓ వ్యక్తి తరచూ మీడియా చర్చావేదికల్లో మాట్లాడతారు. అమరావతిలో ఆందోళన చేస్తున్న మహిళల వస్త్రధారణపై కామెంట్లు చేయడంతోపాటు చర్చావేదికల్లోనే దారుణమైన అవమానానికి గురైన వ్యక్తి సామాజిక కోణంలో వైసీపీ కోవర్టు అని ఆ పార్టీవారే కామెంట్లు చేస్తుంటారు. వీరంతా ఓ సెటిల్‌మెంట్‌లో మరో నేతను కూడా లాగడంతో ఆయన కూడా వైసీపీ కోవర్టుగా మారారని, వీరు పార్టీలో కీలకంగా ఉన్నంత కాలం ఏపీలో పార్టీ పుంజుకోదని ఆ పార్టీ నాయకుల కామెంట్లు చేస్తున్నారు.
Must Read ;- టీడీపీ స్మార్ట్ వర్క్..హార్డ్ వర్క్ @తిరుపతి
జనసేనతో తెంచుకునేందుకు..
వాస్తవానికి జనసేన పార్టీతో సఖ్యతగా ఉండేందుకు సదరు కోవర్టు నాయకులకు ఇష్టం లేదని జనసేనలోని కొందరు నాయకులు చెబుతున్నారు. అందుకే వీలైనప్పుడల్లా జనసేనను తీసిపారేసినట్లు మాట్లాడడం, అధిష్టానం క్లాస్ తీసుకున్నాక మళ్లీ జనసేనతో సఖ్యతగా ఉండడం గమనించవచ్చని జనసేన నాయకులు చెబుతున్నారు. జనసేనతో పొత్తు ఉంటే.. వైసీపీతో లావాదేవీల్లో ఇబ్బంది అవుతుందనే సదరు కోవర్టు నాయకుల భయమని జనసేన నాయకులు చెబుతున్నారు.
రత్నప్రభకీ ఇబ్బందే..
కాగా టీడీపీ చేసిన బీజేపీలో వైసీపీ కోవర్టు విమర్శలు అటూఇటూ తిరిగి తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు ఇబ్బంది కలిగించేవిగా మారాయి. ఇందుకు కారణం కూడా ఉంది. గతంలో వైఎస్ హయాంలో జరిగిన కార్యకలాపాల విషయంలో కొన్ని కేసులను రత్నప్రభ ఎదుర్కోవాల్సి వచ్చింది. తరువాత ఆ కేసుల నుంచి బయటపడ్డారు. కర్ణాటక సీఎస్‌గా చేశారు. తరువాత అక్కడ బీజేపీలో చేరారు. అయితే వైఎస్‌ను కీర్తిస్తూ, వైఎస్ ను పొగుడుతూ ట్వీట్ చేశారు. అంతేకాదు జగన్ సీఎం అయ్యాక అభినందనలు చెప్పారు. కర్టసీ కోసం అభినందనలు చెప్పడంలో ఇబ్బంది లేదు. అయితే వైఎస్ చనిపోయి పదేళ్లైంది.. ఇప్పుడు ఆయన కుమారుడు సీఎం అయ్యాడు. వైఎస్ ఆత్మ శాంతిస్తుంది అని ట్వీట్ చేశారు. టీడీపీ ఇప్పుడు ఆ ట్వీట్‌లను ప్రచారం చేస్తోంది. బీజేపీలో చేరినా..కర్టసీ ప్రకారం కొన్ని వ్యాఖ్యలు చేస్తే ఎవరూ తప్పు పట్టరని, అయితే అభిమానాన్ని చాటుకోవడంతో రత్నప్రభ బీజేపీకి, వైసీపీకి కూడా దగ్గరవ్యక్తి అని టీడీపీ ప్రచారం చేస్తోంది. ఓవైపు నాయకుల వైఖరితో ఇప్పటికే ఇబ్బందిపడుతున్న బీజేపీ.. తాజాగా టీడీపీ వ్యాఖ్యలతో రత్నప్రభను ఇబ్బందుల్లోకి నెట్టిందని చెప్పవచ్చు. ఈ విమర్శలపై స్పందించిన రత్నప్రభ తాను కర్టసీ కోసమే విమర్శలు చేశానని, మంచి పనులు ఎవరు చేసినా తాను అభినందింస్తానని, అందులో తప్పు బట్టడానికి ఏమీ లేదని వ్యాఖ్యానించారు.
Also Read ;- ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన సీఎం : టీడీపీ నాయకులు నారా లోకేశ్, అయ్యన్నపాత్రుడు