పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలో పిన్నెల్లి రావణుడు హత్యాకాండ రోజురోజుకు పెచ్చురిల్లుతున్నాయి. తాగునీరు అడిగిన నేరానికి గిరిజన మహిళను అత్యంత కిరాతంగా ట్రాక్టర్ తో తొక్కించి హత్య చేశారు పిన్నెల్లి అనుచరులు..
మాచర్ల గడ్డ అనేక మారణహోమాలకు అడ్డగా మారింది. చంబల్ లోయలో కలియుగ రావణుడిగా పిన్నెల్లి చేస్తున్న దాష్టీకాలకు ప్రజలు చిగురుటాకులా వణికిపోతున్నారు. తాజాగా రెంటచింతల మండలం మల్లవరం గ్రామం తాగునీరు అడిగిన నేరానికి గిరిజన మహిళ బాణావత్ సామిని ని ట్రాక్టర్ తో తొక్కించి దారుణంగా హత్య చేశారు పిన్నెల్లి అనుచరులు. గిరిజన మహిళను అత్యంత కిరాతంగా ట్రాక్టర్ ఎక్కించి చంపడమే కాకుండా శవంపై మూడు సార్లు ముందుకు వెనక్కి ట్రాక్టర్ ను నడిపి..నుజ్జు నుజ్జు చేశారు. మానవత్వం మంట కలిసే ఈ దృశ్యం.. అక్కడి గిరిజనులను భయబ్రాంతులకు గురిచేసింది. చూస్తున్న గ్రామ ప్రజలను కలిచివేసింది. స్ధానిక ఎమ్మెల్యే పిన్నెల్లి కనుసన్నల్లో నియోజకవర్గంతో పాటు రెంటచింత మండల పరిధిలో వైసీపీ నేతలు బీహార్ గ్యాంగ్ మాదిరిగా ప్రజలను చిత్ర హింసలకు గురిచేస్తున్నది అక్షర సత్యం.
రెంటచింతల మండలం గత రెండు నెలలుగా తాగునీరుకు కటకటలాడుతోంది. మల్లవరం గ్రామంలో గడిచిన పదిరోజులుగా టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న ప్రాంతానికి నీటి ట్యాంకర్లను పంపకుండా స్థానిక వైసీపీ నేతలు కుట్రలకు తెరతీశారు. ఈ నేపధ్యంలో బాణావత్ సామిని బిందెతో ట్రాక్టర్ కు ఏర్పాటు చేసిన ట్యాంకర్ వద్దకు వెళ్లి తాగునీరు కావాలని అడుగగా.. మీరు టీడీపీ సానుభూతిపరులు.., మీకు నీరిచ్చేదే లేదని నానా దుర్భాషలు ఆడి, టాక్టర్ ఇంజన్ స్టార్ట్ చేసి ట్రాక్టర్ ను ఆమెపై ఎక్కించాడు పిన్నెల్లి అనుచరుడు. దీంతో సామిని వెనుక టైర్ కింద ఇరుక్కోని రోధిస్తుంటే.. ఆ రోధన వినకుండా చావు .. చావు అంటూ ట్రాక్టర్ ను మూడుసార్లు ఆమె శరీరంపైకి ఎక్కించి.. నుజ్జు నుజ్జు అయ్యే వరకు వదల్లేదు. దీంతో సామిని అక్కడిక్కడే మృతి చెందింది.
సామిని కుటుంబ సభ్యులు, బంధువులు సామిని మృత దేహాన్ని మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబాన్ని మాచర్ల టీడీపీ, జనసేన ఎమ్మెల్యే అభ్యర్ధి జూలకంటి బ్రహ్మానందరెడ్డి పరామర్శించారు. దుష్ట సైకో పిన్నెల్లి పాలనలో ఇటువంటి చావులు ఎన్ని చూడాలని అవేదన వ్యక్తం చేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.., నియోజకవర్గానికి చుక్క నీరు ఇవ్వకపోగా.. నీరు ఎందుకివ్వరు..? అని ప్రశ్నిస్తున్న ప్రజలను.. అమానుషంగా హత్యచేసి నీరు పారించాల్సిన నేలపై ‘నెత్తురు’ పారిస్తావా పిన్నెల్లి..? అని నిలదీశారు. నీ రౌడీ రాజకీయానికి ఇంకెంతమందిని బలికావాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిన్నెల్లి సోదర్లకు పోలీసులు ఊడిగం చేస్తున్నారని అక్రమ కేసులతో పాటు సామిని హత్యను ప్రమాదంగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బాధిత కుటుంబాన్ని అన్నీ విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ తరుణంలో సామిని కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. సామిని హత్యకు పిన్నెల్లి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు