వైసీపీ ఎమ్మెల్యే సంజీవయ్య ఘోర అవమానికి గురయ్యారు. ఆదివారం నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని బీడీ కాలనీలో పర్యటించారు. చెత్తను తరలించే వాహనాల పార్కింగ్ షెడ్డు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. స్థానికులు ఎమ్మెల్యేను చుట్టుముట్టి పలు సమస్యలపై నిలదీశారు. ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాన్వాన్ కు అడ్డంగా నిలిచారు. స్థానికులు పెద్ద ఎత్తున చేరుకొని నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు, ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది కలుగజేసుకొని స్థానికులను నిలువరించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. దీంతో ఎమ్మెల్యే తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకోవాలసి వచ్చింది.
Must Read ;- కష్టపడిందంతా చంద్రబాబు.. కియా క్రెడిట్ తమదేనంటూ వైసీపీ మంత్రి కలరింగ్











