అత్యవసర సమయంలోనూ డ్రోన్స్ వినియోగం కీలకంగా మారింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో.. వ్యాక్సిన్ పంపిణీకి డ్రోన్స్ ను వాడాలని ప్రభుత్వం యోచిస్తోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ పట్టణాలు, నగరాల్లో ముమ్మరంగా జరుగుతోంది. కానీ గ్రామాల్లో మాత్రం అనుకున్న మేర పంపిణీ జరగడం లేదు. దీంతో మారుమూల గ్రామాల్లో సైతం వ్యాక్సిన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. రోడ్డు మార్గాలు లేని ప్రాంతాలకు వ్యాక్సిన్లు అందజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డ్రోన్స్ వాడకం గురించి ఐసీఎంఆర్ అధ్యయనం చేసి, వ్యాక్సిన్లను తరలించవచ్చని స్పష్టం చేసింది.
Must Read ;- వృథా చేస్తే కోతే.. టీకాల పంపిణీకి కేంద్రం కొత్త మార్గదర్శకాలు











