వైసీపీ సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి నిన్న మీడియా ముందు వాడిన భాషను టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తప్పుపట్టారు.మమ్మల్ని తిట్టి, మామేదే నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా అంటూ టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి ధ్వజమెత్తారు. సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి వాడుతున్న భాష చాలా నీచంగా, జుగుప్సాకరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.వారు వాడిన భాషపై పోలీసులకు ఫిర్యాదు ఇవ్వటానికి ప్రయత్నించినా ఒక్క అధికారి కూడా అందుబాటులో లేకుండా పోయారని, కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.తాను ఏం దొంగతనం చేశానని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని సోమిరెడ్డి ప్రశ్నించారు.
కుటుంబాన్ని బజారుకు లాగుతావా?
తాను, తన కుటుంబ సభ్యులు వేల కోట్ల ఆస్తులు సంపాదించినట్టు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారని, వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోందని, వెయ్యికొట్లు ఎక్కడ దాచానో చూపించాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.మేము పద్ధతిగా పెరిగాం…మాకు భూతులు రావన్నారు.ఆనందయ్యకు తెలియకుండానే వెబ్ సైట్ తయారు చేయించారని ఆయన గుర్తు చేశారు. నెల్లూరు జిల్లాలో కాకాణి గోవర్థన్‌రెడ్డి లాంటి నికృష్ణమైన భాష మాట్లాడే వాడు మరొకడు లేడని ఆయన అన్నారు. నీవు మాట్లాడిన భాష మీ అమ్మకు, భార్యకు వినిపించు, వారు ఏం చెబుతారో విను, సీఎం జగన్మోహన్ రెడ్డికి కూడా వినిపించు, వారు ఏం చెబుతారో చూడాలని సోమిరెడ్డి సూచించారు.ఇంత కంటే నీచమైన భాష మరొకరు మాట్లాడకూడదని, నెంబర్ వన్‌గా నిలబడాలని అనుకుంటున్నావా అని కాకాణి గోవర్థన్ రెడ్డిపై సోమిరెడ్డి విరుచుకుపడ్డారు.
Must Read ;- ఆనందయ్య కంటి మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్











