వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు జులై 1 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ రాజమహేంద్రవరం కోర్టు నిర్ణయం తీసుకుంది.అనంత బాబు తన దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యంను తన వెంట తీసుకెళ్లి చంపేసి, ఆ తర్వాత మృతదేహాన్ని బాధితుడి ఇంటి వదిలి వెళ్లిన ఘటన ఏపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే.ఈ హత్య కేసులో పోలీసులు అనంతబాబు ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కాగా కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో అనంతబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
ఈ ఘటనలో పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత అనంతబాబు తన నేరాన్ని అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి విపక్షాలు అనేక పోరాటాలు చేశాయి.కాగా, అనంతబాబు అంశంలో వైసీపీ తన స్టాండ్ ఏమిటనేది ఇప్పటివరకు స్పష్టం చేయని పరిస్థితి. ఒకానొక దశలో కొందరు ఆవిసిపి నాయకులు అనంతబాబుని సమర్దించినట్లు వార్తలు వినిపించాయి. ఈ కేసులో ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు రిమాండ్ గడువు ముగియడంతో పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఆయన రిమాండ్‌ను పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే అనంతబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ఇప్పటికే రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు తోసిపుచ్చింది. బెయిల్ మంజూరు చేయడానికి నిందితుడి తరపు న్యాయవాది సరైన కారణాలు చూపనందువల్ల బెయిల్ పిటిషన్ ను రద్దు చేస్తున్నట్టు కోర్టు తెలిపింది. అనంతబాబు బెయిల్ పై విడుదలైతే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందనే అంశాలను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్న కోర్టు బెయిల్ పిటిషన్ కు తోసిపుచ్చినట్లు తెలుస్తోంది.