వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్తున్న తనపై తెదేపా కార్యకర్త ఒకరు తన పై దాడికి ప్రయత్నించారంటూ వైకాపా ఎంపీ నందిగాం సురేశ్ తన ట్విటర్ ఖాతాలో తెలిపారు.
ఏమైందంటే..
గురువారం రాత్రి నందిగాం సురేశ్ తన వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో తన కారుకు ఓ వ్యక్తి తన బండిని అడ్డంగా నిలిపి తనను అసభ్య పదజాలంతో దూషించాడు. దీనిపై ఆ వ్యక్తిని ప్రశ్నించగా అతను తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్ తో దాడికి యత్నించినట్లు తెలిపారు. ఆ వ్యక్తి తెదేపా కార్యకర్త పూర్ణ చంద్ర రావు’ అని తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు.
సదరు వ్యక్తిని తన గన్ మెన్ లు పట్టుకోవడానికి ప్రయత్నించిడంతో అతను అక్కడ నుంచి పారిపోయాడని ఆయన వివరించారు. అయితే గన్ మెన్ లు అతనిని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
నిన్న రాత్రి వ్యక్తిగత పనుల మీద బయటకు వెళుతున్న సమయంలో నా కారుకు బైకు అడ్డంగా పెట్టి నాపై ఇష్టానుసారంగా అసభ్య పదజాలంతో దూషించి కారును బైక్ తో ఢీకొట్టి నాపై ఇనుప రాడ్ తో దాడికి యత్నించిన టిడిపి కార్యకర్త పూర్ణచంద్రరావు. pic.twitter.com/2hdsfqLVHZ
— Nandigam Suresh Babu – YSRCP (@NandigamSuresh7) October 16, 2020











