టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణలోనూ కేసులు నమోదవుతున్నాయి.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ సర్కార్‌పై చంద్రబాబు నాయుడిపై ఎలాంటి ఆధారాలు లేకుండా పలు కేసులు బనాయిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. చిన్న ఆధారం కూడా చూపకుండా ఏకంగా 52 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్నారు చంద్రబాబు.. తాజాగా మధ్యంతర బెయిల్‌పై ఆయన బయటకు వచ్చారు.. చికిత్స కోసం ఆయన విజయవాడ నుండి హైదరాబాద్‌లో అడుగుపెట్టారు.. హైదరాబాద్‌లో అడుగుపెట్టారో లేదో తెలంగాణలోనూ ఆయనపై కేసు నమోదు అయింది..
చంద్రబాబు నాయుడు పై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు.. IPC సెక్షన్ 341,290,341 and 21r/w76CP చట్టం కింద కేసు నమోదు చేశారు. జయచందర్ సబ్ ఇన్స్పెక్టర్ పిర్యాదు మేరకు ఈ కేసు ఫైల్ అయింది.. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి జూబ్లిహిల్స్ జూబ్లిహిల్స్ చంద్రబాబు నివాసానికి ర్యాలీ తీశారని పిర్యాదు చేశారు ఎస్ఐ జయచందర్.. రెండుగంటలు రోడ్లపై న్యూసెన్స్ చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని ఈ కంప్లయింట్లో ఆయన వివరించారు..
చంద్రబాబు నాయుడితోపాటు హైదరాబాద్ సిటీ టీడీపీ పార్టీ జనరల్ సెక్రెటరీ GVG నాయుడు, మరి కొందరిపై కేసులు నమోదయ్యాయి.. సుమారు 400మంది ర్యాలీలో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. చంద్రబాబు నాయుడు, ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు చేసిన ర్యాలీతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు, ట్రాఫిక్ కి విఘాతం జరిగిందని వివరించారు..
చంద్రబాబు నాయుడుపై తెలంగాణలోనూ కేసులు ఫైల్ కావడం రాజకీయంగా కాక రేపుతోంది.. ఇప్పటికే, ఆయనపై ప్రజల నుండి ఎలాంటి ఫిర్యాదులు లేకున్నా.. ఏపీ సీఐడీ కేసులు నమోదు చేస్తోంది. తాజాగా తెలంగాణలోనూ పోలీసులే ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారుతోంది.. మరి, ఈ కేసు పరిణామాలు ఎలా మారిపోతాయో చూడాలి..